చూడబోతే అలాగే ఉందని అందరిలోను అనుమానాలు మొదలవుతున్నాయి. చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడే తోక పత్రిక కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేయటంతో చంద్రబాబు అరెస్టు తప్పదనే అనిపిస్తోంది. జగన్ చేస్తున్న కసరత్తంతా చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారని జనాలకు చెప్పటానికే అన్నట్లుగా తోక పత్రిక అనుమానం వ్యక్తం చేసింది.
నిజానికి చంద్రబాబు ఐదేళ్ళ పాలనంతా అత్యంత అవినీతిమయమని ప్రతి ఒక్కరికీ తెలుసు. నీరు, మట్టి, ఇసుక, ఆకాశం, భూమి…ఇలా దేన్నీ టిడిపి నేతలు వదల్లేదు. ఏ విషయం తీసుకున్న మెజారిటి టిడిపి నేతలు దున్నిపడేశారు. చంద్రబాబు ప్రభుత్వం మీద జనాలకు ఏహ్యభావం పెరిగిపోవటంలో విచ్చలవిడి అవినీతి కూడా ఓ కారణమే.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి చేస్తున్న సమీక్షల్లోనే ఏ శాఖల్లో ఎంతెంత అవినీతి జరిగిందో బయటకు వస్తోంది. అలాంటపుడు జరిగిన అవినీతిని జనాల ముందుంచటంలో తప్పేం ఉంది ? చంద్రబాబు అవినీతి చేసినట్లు జనాల ముందు పెట్టటానికి జగన్ కసరత్తు చేయటంలేదు. చంద్రబాబు చేసిన అవినీతినే జగన్ జనాల ముందుంచటానికి ప్రయత్నిస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో భూ కొనుగోలులో ఇన్ సైడర్ ట్రేడింగ్, పోలవరం ప్రాజెక్టు, నీరు-చెట్టు లాంటి ప్రతీ ప్రాజెక్టుపైనా విచారణ జరిపితే కానీ జరిగిన అవినీతి ఎంతన్నది తేలదు. అవినీతి అంటూ తేలిన తర్వాత చర్యలు తప్పవు కదా ? ఇక్కడే చంద్రబాబు మీడియా భయపడుతోంది. చంద్రబాబుకు న్యాయపరమైన చర్యలకు దిగితే తాము కూడా ఎక్కడో ఓ చోట ఇరుక్కోవాల్సొస్తుందనే భయపడుతున్నట్లుంది. తప్పు చేయటం ఎందుకు ? విచారణకు భయపడటం ఎందుకు ?