కొణతాల ఏ పార్టీలో చేరుతారో తెలుసా ?

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఏ పార్టీలో చేరుతారనే విషయం ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారింది. సుదీర్ఘ రాజకాయ అనుభవం ఉన్న కొణతాల చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉత్తరాంధ్ర ఐక్యవేదిక అనే ఉద్యమ సంస్ధ ద్వారా జనాల్లోనే ఉంటున్నా తనపై ఏ పార్టీ ముద్ర పడకుండా జాగ్రత్తపడుతున్నారు. వైసిపి ఆవిర్భావం నుండి చాలా యాక్టివ్ గా ఉన్నా జగన్ తో విబేధాల కారణంగా బయటకు వచ్చేశారు. తర్వాత ఏ పార్టీలో చేరలేదు. టిడిపి, జనసేన పార్టీల నేతలు కొణతాలతో టచ్ లో ఉన్నా మాజీ మంత్రి మాత్రం న్యూట్రల్ గానే ఉన్నారు.

 

ప్రొఫెఫనల్ రాజకీయ నేత అయిన కొణతాల ఏ పార్టీలో చేరకుండా ఎక్కువ కాలం ఉండలేరు. ఎందుకంటే, త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏదో ఒక పార్టీలో చేరందే రాజకీయంగా మనుగడ సాధ్యం కాదు. అంటే ఏదో ఒక పార్టీలో చేరి యాక్టివ్ అవ్వాల్సిన అవసరమైతే ఇపుడు కొణతాలకు వచ్చేసింది. అందుకే తన మద్దతుదారులతో సీరియస్ గా మీటింగులు పెట్టుకుంటున్నారు. వైసిపి కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కొణతాలతో మాట్లడుతున్నారు. మళ్ళీ వైసిపిలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం. కొణతాల ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

 

తాజాగా నర్సీపట్నంలో కొణతాల మాట్లాడిన తీరు చూస్తుంటే బహుశా టిడిపిలో చేరటానికి మొగ్గు చూపుతున్నట్లే కనబడుతోంది. వైసిపి గ్రాఫ్ తగ్గుతోందన్నారు. ప్రతిపక్షాల్లో అనైక్యత బాగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సంస్ధాగతంగా పార్టీని బలోపేతం చేయటంపై పవన్ దృష్టి పెట్టకపోవటం పెద్ద మైనస్ గా కొణతాల చెప్పారు. వైసిపి-జనసేన మధ్య పొత్తు కుదిర్చే బాధ్యతను బిజెపి తీసుకుంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

 

ప్రతిపక్షాల్లో ఇన్ని లోపాలను చెప్పిన కొణతాల టిడిపిని మాత్రం పొగుడుతున్నారు. అంటే టిడిపి విషయంలో సానుకూలంగా ఉన్నట్లే కనిపిస్తోంది. కాబట్టే టిడిపిలో కొణతాల చేరవచ్చనే ఊహాగానాలకు ఊతమిచ్చినట్లైంది.  ఉత్తరాంధ్రకు ఎంతో కీలకమైన సుజలస్రవంతి, విమ్స ప్రాజెక్టులను మంజూరు చేయటాన్ని ప్రస్తావించారు. పనుల ప్రారంభానికి నిధులు మంజూరు చేస్తున్న చంద్రబాబును ప్రశంసించారు. చూడబోతే టిడిపి తరపునే అనకాపల్లి ఎంపిగానో లేకపోతే ఎంఎల్ఏగానో పోటీ చేసే అవకాశాన్ని కొట్టిపారేసేందుకు లేదు.