మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జనసేన తరపున పోటీ చేసే క్యాండిడేట్ ఫైనల్ అయ్యిందట. అంటే ఇంకా అధాకారికంగా ప్రకటించలేదనుకోండి. పేర్ల పార్ధసారధిరెడ్డి అని కడప జిల్లాలో పెద్ద ఫ్యాక్షన్ లీడరు లేండి. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ప్రముఖుడు. 1998 మేనెల 23వ తేదీన వైఎస్ రాజారెడ్డి హత్యకు గురైన సంగతి గుర్తుండే ఉంటుంది. అందులో అప్పట్లో 11 మందిని గుర్తించారు. అందులో పార్ధసారధి రెడ్డి ముఖ్యుడు. కాకపోతే అదృష్టం కొద్దీ ఆయన పాత్రపై రుజులు దొరకలేదు. కాబట్టి బయటపడిపోయారు. ఈయనతో పాటు సతీష్ రెడ్డి పాత్రపై కూడా ఆధారాలు దొరకలేదు. కాబట్టి వారిద్దరు కేసు నుండి బయటపడిపోయారు.
తర్వాత జరిగిన రాజకీయపరిణామాల్లో ఇద్దరు తెలుగుదేశంపార్టీలో చేరారు. సతీష్ రెడ్డికి వెంటనే రాజకీయంగా లిఫ్ట్ దొరికింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ఓసారి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు కూడా. తర్వాత ఎంఎల్సీగా నామినేట్ అయి శాసనమండలి డిప్యుటి ఛైర్మన్ కూడా అయ్యారు. ఈ పరిస్ధితుల్లోనే ఎన్ని సంవత్సరాలు ఎదురుచూసినా తెలుగుదేశంపార్టీ తరపున రాజకీయంగా ఎలాంటి పదవులు రాలేదు పార్ధసారధికి. భవిష్యత్తులో వస్తుందన్న నమ్మకం కూడా లేదట. అందుకే జనసేనలో చేరి పులివెందులలో పోటీ చేయబోతున్నారు.
పార్ధసారధికి టిక్కెట్టిచ్చే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దాదాపు ఓకే చేసినట్లే అని పార్టీ వర్గాలు చెప్పాయి. ఎందుకంటే, జనసేన తరపున పోటీ చేయటానికి నియోజకవర్గాల్లో అభ్యర్ధులే దొరకటం లేదు. అటువంటిది పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడాలంటే మామూలు విషయం కాదు. ఈ నేపధ్యంలోనే పోటీకి సై అంటు ముందుకు వచ్చిన పేర్ల కే టిక్కెట్టు ఖరారైందని సమాచారం.
మొదటి టిక్కెట్టును తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణకు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంత కాలానికి పులివెందులలో పేర్ల టిక్కెట్టు కూడా కన్ఫర్మ్ అయినట్లే. టిడిపి తరపున మళ్ళీ సతీష్ రెడ్డే పోటీ చేస్తారో లేకపోతే ఎంఎల్సీ బిటెక్ రవినే రంగంలోది దిగుతారో ఇంకా తేలలేద. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో పులివెందుల ఎన్నికలు కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండటం ఖాయం.