100కి పైగా సీట్లు కోరుతున్న జనసేన.! నిజమేనా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నట్లుంది జనసేన వ్యవహారం.! ‘రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను..’ అని పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యల తర్వాత, పొలిటికల్ ఈక్వేషన్ మారింది. అంతకు ముందు చంద్రబాబు ‘వన్ సైడ్ లవ్..’ అంటూ జనసేన మీదకు వలపు బాణం సంధించిన విషయం విదితమే.

కాగా, జనసేన పార్టీతో ఏకీభవించిన బీజేపీ, ‘ఒకవేళ టీడీపీ గనుక తమతో కలవాలనుకుంటే, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలి..’ అని సెలవిచ్చి.. అప్పట్లో పెను సంచలనానికి తెరలేపింది. ‘మనం కొన్ని త్యాగాలు చేయక తప్పదు..’ అంటూ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించడంతో.. ఈక్వేషన్ మరింత ఆసక్తికరంగా మారింది.

బీజేపీ, టీడీపీ రాజకయాల్ని నిజానికి జనసేన తట్టుకోలేదు. ప్రస్తుతానికైతే, ఆంధ్రప్రదేవ్ రాష్ట్ంరలో వైసీపీ తర్వాత జనసేన పార్టీనే సెంటరాఫ్ ఎట్రాక్షన్. అందుకు కారణాలు అనేకం. బీజేపీకి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సీన్ లేదు. టీడీపీ రోజురోజుకీ నిర్వీర్యమైపోతోంది. జనసేన యంగ్ జనరేషన్ పార్టీ.. క్రమంగా బలం పుంజుకుంటోంది.

వైసీపీ ఈ విషయాన్ని గుర్తించింది.. అందుకే, టీడీపీ కంటే ఎక్కువగా జనసేనను టార్గెట్ చేస్తూ వచ్చింది. ఎలాగైతేనేం, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసేందుకు మార్గం సుగమం అవుతోంది. ఈ సమయంలోనే జనసేన ఓ చిత్రమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందట. వంద సీట్లకు తగ్గకుండా తాము పోటీ చేస్తామని జనసేన చెబుతోందట.

‘అదెలా కుదురుతుంది.?’ అని టీడీపీ, బీజేపీ.. మండిపడుతున్నాయట. బీజేపీ ఏకంగా 50 సీట్ల మీద కన్నేసింది. టీడీపీ లెక్క వేరే వుంది.. ‘బీజేపీ, ప్లస్ జనసేన.. ఓ పాతిక నుంచి ముప్ఫయ్ సీట్లు ఇస్తాం..’ అని టీడీపీ నేతలు చెబుతున్న విషయం విదితమే.

కానీ, జనసేన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమకు వంద సీట్లు కావాలని తెగేసి చెబుతోందట. బీజేపీకి ఈ విషయంలో పెద్దగా ఇబ్బది లేదు.. ఓ పాతిక సీట్ల కంటే ఎక్కువగా బీజేపీ పోటీ చేయడానికి సైతం ఆశపడే పరిస్థితి లేదు. తేల్చుకోవాల్సింది టీడీపీనే.!