బలమైన వర్గాన్ని దూరం చేసుకున్న చంద్రబాబు..షాక్ తప్పదా ?

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు యువత నుండి ప్రత్యేకంగా నిరుద్యోగ యువత నుండి పెద్ద షాక్ తప్పేలా లేదు. ఈమధ్య కాలంలో నిరుద్యోగులతో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై నిరుద్యోగ యువత బాగా మండిపోతోంది. అందుకే రాష్ట్రమంతటా తిరుగుతూ చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేయాలని తీర్మానించుకున్నారు నిరుద్యోగ యువత. తిరుపతిలో జరిగిన పేదరికంపై గెలుపు సందర్భంగా జరిగిన వ్యవహారంతో స్వయంగా తన నెత్తిన తానే చంద్రబాబు చెత్త వేసుకున్నట్లైంది.

జాబు అడిగినా పాపానికి ఉపాధ్యాయ నిరుద్యోగులపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఉపాధ్యాయ నిరుద్యోగులపై చంద్రబాబు మండిపడటం ఇదే తొలిసారి కాదు. బహుశా ఇదే చివరిదీ కాబోదేమో ? డిఎస్సీ ప్రకటనలిస్తున్నామని, నిరుద్యోగ భృతి ఇస్తున్నామనే కలరింగ్ ఇచ్చిన చంద్రబాబుకు నిరుద్యోగులు గట్టి ఫిట్టింగే పెట్టారు. దాంతో చంద్రబాబుకు, నిరుద్యోగ ఉపాధ్యాయులకు మాటమాట పెరిగి చివరకు అరెస్టుల దాకా వెళ్ళింది వ్యవహారం.

పోయిన ఎన్నికల్లో జాబు కావాలంటే బాబు రావాలి అన్న నినాదానికి ఆకర్షితులై పాపం నిరుద్యోగ యువతలో అత్యధికులు చంద్రబాబుకే ఓట్లేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడుకు నారా లోకేష్ కు మాత్ర ఉద్యోగం వేయించుకున్నారు. మిగిలిన యువతను మాత్రం గాలికొదిలేశారు. దాంతో లక్షలాది మంది నిరుద్యోగయువత చంద్రబాబుపై మండిపోతున్నారు. దాంతో చంద్రబాబు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా అక్కడకు హాజరై వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంటే ఇచ్చిన మాటను తప్పిన చంద్రబాబును వెంటాడుతున్నట్లే ఉంది.

నిరుద్యోగ యువత ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో సుమారు 32 లక్షలమంది నిరుద్యోగులున్నారు. వీరిలో ఒక్కొక్కరి కుటుంబంలో ఎంత తక్కువేసుకున్నా నలుగురు సభ్యులుంటారు. అంటే తక్కువలో తక్కువ 30 లక్షలు ఇంటు నలుగురు సభ్యులను వేసుకోవచ్చు. దాదాపు 1.20 కోట్ల ఓట్లన్నమాట. 1.20 కోట్ల ఓట్లంటే మాటలా ? అందులో  సగం ఓట్లు చంద్రబాబుకు వ్యతిరేకంగా వేసినా చాలు తెలుగుదేశంపార్టీపై దెబ్బ పడిపోవటానికి.

సరే, చంద్రబాబుకు వ్యతిరేకంగా పడే ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డికే పడతాయని అనుకునేందుకూ లేదులేండి. అయితే, వైసిపికి లేదా జనసేనకు పడొచ్చు. అయితే, జగన్, పవన్ కల్యాణ్ ఇద్దరిలో ఎవరు అధికారంలోకి వస్తారని నిరుద్యోగులు అనుకుంటారో వాళ్ళకే ఓట్లు వేసే అవకాశాలును కొట్టిపారేయలేము. ఇప్పటికైతే పవన్ కు అధికారంలోకి వచ్చే అవకాశాలైతే లేవు. కాబట్టి మిగిలింది జగన్ మాత్రమే. అందుకే నిరుద్యోగులు జగన్ కు