ఫిరాయింపు మంత్రికి కష్టాలా ? వదిలించుకోవాలని చూస్తున్నారా ?

కడప జిల్లా రాజకీయాలు జాగ్రత్తగా గమనిస్తున్నవారికి ఓ సందేహం వస్తోంది. అదేమిటంటే ?ఫిరాయింపు ఎంఎల్ఏ, మంత్రి ఆదినారాయణరెడ్డిని చంద్రబాబునాయుడు వదిలించుకోవాలని చూస్తున్నాడా అని. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి మంత్రిని జమ్మలమడుగు నుండి కాకుండా కడప ఎంపిగా పోటీ చేయించాలని నిర్ణయించారట. అదే విషయాన్ని ఫిరాయింపు మంత్రికి చెప్పేశారట. అయితే ఆదికి కడప ఎంపిగా పోటీ చేయటం ఇష్టం లేదట. ఆదికి ఇష్టమున్నా లేకపోయినా కడప ఎంపిగా పోటీ చేయక తప్పేట్లు లేదట. ఇపుడీ విషయంపైనే జిల్లా టిడిపి నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


నిజానికి పోయిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిగా గెలిచిన ఆది నారాయణరెడ్డి తర్వాత చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి టిడిపిలోకి ఫిరాయించారు. అప్పటి వరకూ జమ్మలమడుగుకు సంబంధించి రామసుబ్బారెడ్డి చెప్పిందే వేదం. ఆది, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల ఇద్దరికీ బద్ద వైరముందన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు కూడా ఈ విషయం బాగా తెలుసు. తెలిసే ఆదిని టిడిపిలోకి లాక్కున్నారు.

ఆది టిడిపిలోకి ఫిరాయించటమే కాకుండా ఏకంగా మంత్రి కూడా అయిపోవటంతో రామసుబ్బారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. సరే తర్వాత నుండి ఇద్దరి మధ్య గొడవలు అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని ఇపుడు ప్రచారం జరుగుతోంది లేండి. అదే సమయంలో షెడ్యూల్ ఎన్నికల వేడి రాజుకుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలనే సమస్య మొదలైంది. ఇటు ఫిరాయింపు మంత్రి, అటు రామసుబ్బారెడ్డి ఎవరికి వారుగా పట్టుబట్టి కూర్చున్నారు.

ఎందుకంటే, జమ్మలమడుగులో పోటీ చేయటమన్నది ఇద్దరికీ ప్రిస్టేజ్ గా మారిపోయింది. ఇద్దరి మధ్య ఈ సమస్య రాకూడదనే చంద్రబాబు ఎన్ని పంచాయితీలు చేసినా ఉపయోగం లేకపోయింది. అందుకే ఇద్దరిలో ఒకరిని ఎంఎల్ఏగా మరొకరిని కడప ఎంపిగా పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. రామసుబ్బారెడ్డికి అసెంబ్లీ టిక్కెట్టు, ఫిరాయింపు మంత్రిని కడప ఎంపిగా పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారట చంద్రబాబు.

కడప ఎంపిగా పోటీ చేయటమంటే ఏంటో ఫిరాయింపుమంత్రికి బాగా తెలుసు. అసలు వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగులో గెలిచేదే డౌట్. జిల్లాలోని నేతల్లో ఎవరు కూడా కడప ఎంపిగా పోటీ చేయటానికి ఇష్టపడకపోతేనే చంద్రబాబు చివరకు ఆదిని పోటీలోకి దింపాలని నిర్ణయించారట. ఆదికి ఇష్టం లేదని కడపలో గెలవటం కష్టమని తెలిసీ ఫిరాయింపు మంత్రిని బలవంతంగా చంద్రబాబు రంగంలోకి దింపుతున్నారంటే ఏమనర్ధం ? నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనపై జనాల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. అదే సమయంలో పాదయాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి జనాల్లో బాగా చొచ్చుకునిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావటం కష్టమని జాతీయ మీడియా సర్వేలు ఒకవైపు చెబుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి కడప ఎంపిగా పోటీ చేస్తే….