చంద్రబాబు ప్రభుత్వంపై విచారణ ? అందుతున్న సంకేతాలు

చంద్రబాబునాయుడు పాలనపై త్వరలో విచారణ తప్పదా ? తాజాగా అందుతున్న సంకేతాలను చూస్తుంటే అదే అనుమానాలు మొదలయ్యాయి. అదే విషయాన్ని బిజెపి నేతలు కూడా చెబుతున్నారు. ఎందుకంటే, చంద్రబాబు పాలన బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ తరహా పాలనను కూడా మించిపోయిందట. ఏపిలో లాలూ పాలన నడుస్తోందంటూ బిజెపి నేతలు మండిపోయారు.

 

బిజెపి ఆరోపణల ప్రకారం లాలూ ప్రభుత్వం అంటే  ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలిస్తున్నాడని కాదు అర్ధం. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ పాలనంటే అరాచకానికి పెట్టింది పేరు. దానికిమించి గడ్డి సరఫరాలో కూడా కోట్లాది రూపాయలు తినేసిన కేసులోనే లాలూ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు లేండి. అంటే లాలూ అనగానే అందరికీ అరాచకపాలన, గడ్డి స్కామే గుర్తుకు వస్తుంది. అటువంటి తరహా పాలనే ఇపుడు ఏపిలో జరుగుతోందని అర్ధం.  

 

ఇంతకీ విషయం ఏమిటంటే, చంద్రబాబు ప్రభుత్వ ధాన్నానే కాదట ఆగ్రిగోల్డ్ ఆస్తులను కూడా దోచుకునేస్తున్నారట. ఈరోజు నుండి ఆగ్రిగోల్డ్ బాధితుల తరపున న్యాయం కోసం బిజెపి నేతలు ఐదురోజుల పాటు దీక్షలు మొదలుపెట్టారు లేండి. ఆ నిరసన దీక్ష సందర్భంగా బిజెపి రాజ్యసభ సభ్యుడు జవిఎల్ నరసింహారావు మాట్లాడుతూ, ఏపిలో కూడా లాలూ తరహా పాలనే నడుస్తోందంటూ మండిపడ్డారు. అమరావతిని కూడా ల్యాండ్ మాఫియాగా మార్చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని జివిఎల్  ఓ వీరతాడేశారులేండి.

 

రాజధానిని ఎక్కడో నిర్మించబోతున్నట్లు లీకులిచ్చిన చంద్రబాబు తర్వాత అమరావతిని ప్రకటించటంలో అర్ధమేంటని నిలదీశారు. రాజధాని పేరుతో తమకు కావాల్సిన చోట్ల భూముల ధరలను పెరిగేట్లు చేసుకుని అమ్ముకున్న తర్వాత చివరకు అమరావతిని రాజధానిగా ప్రకటించారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. టిడిపిలోని ల్యాండ్ మాఫియానే అమరావతి ప్రాంతంలో కూడా భూములను కారుచౌకగా కొట్టేశారంటూ జివిఎల్ మండిపడ్డారు. టిడిపి ఎంపిలే టెండర్లు వేసి, మళ్ళీ వాళ్ళే కాంట్రాక్టులు కూడా దక్కించుకుంటున్నట్లు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది లేదన్న కారణంతోనే అందిన కాడికి టిడిపి రాష్ట్రాన్ని దోచేస్తోందంటూ ఎద్దవా చేశారు.

 

ప్రభుత్వ డబ్బునే కాదని చివరకు అగ్రిగోల్డ్ సంస్ధలో జనాలు దాచుకున్న డబ్బును కూడా దోచుకునేందుకు చంద్రబాబు ప్లాన్ వేసినట్లు మండిపడ్డారు. అగ్రిగోల్డ్ సంస్ధకున్న భూములను లాగేసుకుని తరతరాలకు సరిపడే ఆస్తులను కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు జివిఎల్ మండిపడ్డారు. తుపాను విషయంలో కూడా కేంద్రప్రభుత్వంపై నిందలు వేయటం జనాలను మోసం చేయటమేనంటూ ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్ళ పాలనలో తెచ్చిన రూ 1.5 లక్షల కోట్లకు లెక్కలు చెప్పాలంటూ నిలదీశారు. ఆరునెలల తర్వాత దిగిపోయే ప్రభుత్వం విచారణ జరిపిస్తామంటూ జివిఎల్ హెచ్చరించటం గమనార్హం.