జగన్ ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కిన టైమ్ లోనే ఢిల్లీ నుంచి భారీ ట్విస్ట్ !

Interesting twist in YS Jagan's Delhi tour
ఏపీ సీఎం జగన్‌ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు.  మధ్యాహ్నం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్తారు.  అక్కడి నుంచి జగన్‌ ఢిల్లీకి ప్రత్యేక విమానంలో  బయలుదేరుతారు.  ఢిల్లీలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇంకొందరు పెద్దలను కూడ కలవనున్నట్లు తెలుస్తోంది.  అయితే ఈ పర్యటన ఎందుకు అనేది ఇంకా క్లారిటీగా తెలియట్లేదు.  ఏపీలో ఆలయాల మీద జరుగుతున్నా దాడుల గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి జగన్ వెళ్తున్నారని కొందరంటే త్వరలో బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఏపీకి రావలసిన నిధుల  విషయం మాట్లాడటానికి వెళ్తున్నారని ఇంకొందరు చెబుతున్నారు. 
 
Interesting twist in YS Jagan's Delhi tour
Interesting twist in YS Jagan’s Delhi tour
ఇక టీడీపీ నేతలైతే జగన్ భయంతో ఢిల్లీ బాట పట్టారని ఎద్దేవా చేస్తున్నారు.  టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంతలు బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ ‌రెడ్డిగారు ఈ రోజు మీ ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి లాభం తెస్తుందా ? రావాల్సిన నిధులు ,ప్రత్యేక హోదా పై మీరు పోరాడాలి.  మీరు వెళ్తున్నారా లేక బీజేపీ, కేంద్ర పెద్దలు మీ మత రాజకీయాలు గురించి పిలిపిస్తున్నారా ? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.  గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఆలయాల మీద దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ దాడులను అన్ని రాజకీయ పార్టీలు రాజకీయం కోసం వాడేసుకుంటున్నాయి.  
 
దాడులు చేయిస్తున్నది మీరంటే మీరేనని ఒకరి మీద ఇంకొకరు ఆరోపణలు వేసుకుంటున్నారు తప్ప ఏ ఒక్కరూ కూడ అసలు నిందితుల గురించి ఆలోచించట్లేదు.  చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలు, వైఎస్ జగన్,  వైసీపీ బడా లీడర్లు, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లాంటి పెద్ద తలలంతా వివాదాన్ని గట్టిగా వాడేస్తున్నారు.  భక్తుల భావిద్వేగాలతో ఆడేసుకుంటున్నారు.  బాబుగారేమో రామతీర్థం కొండెక్కి జగన్ క్రిస్టియన్ కాబట్టే ఈ నాడులు అంటే జగన్ ఏమో మీ హయాంలో కూలగొట్టిన ఆలయాలకు శంఖుస్థాపన చేస్తున్నాను అన్నారు.  ఇక బీజేపీ ఏమో రథయాత్ర చేస్తామంటోంది.  ఇలా ఎవరికీ తోచినట్టు వారు చేస్తూ ఇష్యూని నేషనల్ లెవల్లో హైలెట్ చేశారు.  ఢిల్లీ పెద్దలు కూడ ఈ అంశాన్ని తీవ్రంగానే భావిస్తున్నారట.  ఈ తరుణంలో ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ఎలాంటి అంశాల మీద చర్చలు జరుపుతారో అనేది ఆసక్తికరంగా మారింది.