ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాలని సూచించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం వల్ల వైసీపీకి జరిగిన మంచి కంటే చెడు ఎక్కువని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా 100 మందిలో 40 శాతం మంది కచ్చితంగా అసంతృప్తిలో ఉంటారనే సంగతి తెలిసిందే.
కొంతమంది అర్హత కలిగి ఉన్నా ఏదో ఒక తప్పు వల్ల ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే. ప్రజలందరికీ నచ్చేలా పాలన సాగించడం ఏ ఎమ్మెల్యే వల్ల కాదు. గడపగడపకు మన వైసీపీకి బదులుగా ఫోన్ల ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసి ఉంటే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతుండటం గమనార్హం.
10 మందిలో ఒక్కరు వైసీపీ పాలన బాలేదని చెబుతున్నా ఎల్లో మీడియా వారు చెప్పిందే ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై నెగిటివ్ ఒపీనియన్ కలిగేలా చేస్తుండటం గమనార్హం. ఈ తరహా ప్రచారం అధికారంలో ఉన్న వైసీపీకి ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. వైసీపీ ఈ కార్యక్రమం ద్వారా ఇతర పార్టీల నేతలకు విమర్శలు చేసే ఛాన్స్ ఇచ్చింది. ముందుచూపు ఉన్న పార్టీలలో ఒకటైన వైసీపీ ఈ విషయంలో మాత్రం తప్పు చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ పాలన బాగానే ఉన్నా కొన్ని మైనస్ ల వల్ల పార్టీ పరువు పోతుండటం గమనార్హం. ఈ విషయాన్ని వైసీపీ నేతలు సైతం గమనించాలి. కొంతమంది వైసీపీ నేతలు వివాదాలలో చిక్కుకోవడం, మరి కొందరు వైసీపీ నేతలు పార్టీకి చేటు చేసే వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. సీఎం జగన్ కొన్ని అంశాలపై మాత్రమే దృష్టి పెట్టి మరికొన్ని అంశాలను నిర్లక్ష్యం చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.