ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఇరవై నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఒక పార్టీ నేతలు మరో పార్టీపై విమర్శలు చేసుకుంటున్నారు. విశాఖలో 50,000 ఓట్ల గల్లంతు అంటూ జరుగుతున్న ప్రచారం గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ఆంధ్రేతర ప్రాంతాల వాళ్ల ఓట్లను తొలగిస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీకి చెందిన వాళ్ల ఓట్లనే తొలగిస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అడ్డగోలుగా ఓట్లను తొలగించడం ఏమిటని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే జీవీఎల్ నరసింహారావు కామెంట్ల గురించి వైసీపీ నేతలు స్పందించకపోయినా నెటిజన్ల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. వైసీపీకి బీజేపీకి చెందిన వారి ఓట్లు తీసేయడం, వాళ్లకు పథకాలు కట్ చేయడం అవసరమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
సంచలన ప్రకటనలు చేసి మీడియాపై ఫోకస్ కావాలనే ఆలోచనతోనే వైసీపీ ఈ దిశగా అడుగులు వేస్తోందని నెటిజన్లు చెబుతున్నారు. మరి కొందరు నెటిజన్లు ఏపీలో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేవని అందుకే ఈ తరహా కామెంట్లు చేస్తోందని చెబుతున్నారు. ఓట్లు ఎందుకు గల్లంతు అయ్యాయో తెలుసుకోకుండా ఈ విధంగా చేయడం ఏమిటని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సంచలన ప్రకటనలు చేసి మీడియా దృష్టిని ఆకర్షించాలనే ఆలోచనతోనే బీజేపీ ఈ విధంగా చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అంటే గిట్టని వాళ్లు ఈ తరహా ప్రచారాలు చేస్తున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. బీజేపీ చేస్తున్న ఆరోపణల విషయంలో ఎన్నికల అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఈ ఆరోపణలు వైసీపీకి మైనస్ అవుతున్నాయే తప్ప ప్లస్ కావడం లేదు.