Amitabh Bachchan: మూడు రంగుల గడ్డంతో సర్ ప్రైజ్ ఇచ్చిన బిగ్ బీ.. ఫోటో వైరల్!

Amitabh Bachchan: దేశవ్యాప్తంగా జనవరి 26 న గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కరోనా నియమాలను పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ గణతంత్ర వేడుకలను జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమితాబ్ బచ్చన్ కి సంబంధించిన ఫోటో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో విష్ చేశారు.

కానీ అమితాబ్ బచ్చన్ సరికొత్తగా విష్ చేశారు. మూడు రంగుల మువ్వన్నెల జెండాకు సంబంధించిన మూడు రంగుల గడ్డంతో వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు అమితాబ్ బచ్చన్. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అదే ఫోటో ని స్వయంగా అమితాబ్ బచ్చన్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలి అంటూ క్యాప్షన్ ను కూడా జోడించారు. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కొందరు పాజిటివ్ గా స్పందిస్తూ నవ్వుతున్న ఎమోజీస్ ని పెడుతున్నారు. ఈ ఫోటోకి కొన్ని గంటల్లోనే దాదాపుగా 1.9 లక్షల లైక్స్ వచ్చాయి. కాస్త వినూత్నంగా ఆలోచించి గణతంత్ర శుభాకాంక్షలు తెలిపిన అమితాబ్ బచ్చన్ పై నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఆ పోస్ట్ పై స్పందించారు. ఇక అమితాబ్ బచ్చన్ విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్ కు బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ అమితాబ్ బచ్చన్ సినిమా విడుదల అవుతుంది అంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.