Anasuya Bharadwaj: నెటిజన్ లకు సారీ చెప్పిన అనసూయ.. ఎందుకో తెలుసా?

Anasuya Bharadwaj: తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు వెండితెరపై సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. కెరిర్ పరంగా దూసుకుపోతూ తనకు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ సోషల్ మీడియా యూజర్లకు క్షమాపణలు చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా దేశప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది అనసూయ.

అంతేకాకుండా మన జాతీయ గేయం అయిన వందేమాతరం ని పాడుతూ వీడియోను కూడా షేర్ చేసింది. ఇక వీడియోని చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మేడమ్ ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం కాదు..గణతంత్ర దినోత్సవం..మీరు వేసుకొన్న షర్ట్ పై మహాత్మా గాంధీ బొమ్మ ఉంది.. మహాత్మాగాంధీకి గణతంత్ర దినోత్సవానికి సంబంధం ఏమిటి? అంతేకాకుండా మీరు కూర్చుని దేశ గేయాన్ని పాడటం ఏం బాగోలేదు.. కొంచెం నిల్చుని పాట పాడింటే హుందాగా అనిపించేది. ఇలా చెప్పినందుకు మీరు ఫీల్ అయి ఉంటే క్షమించండి అని నెటిజన్లు వరుసగా కామెంట్స్ చేసారు.

 

ఈ కామెంట్ల పై స్పందించిన అనసూయ.. మీరు క్షమాపణలు చెప్పాల్సిన పని లేదు.. నేను నిల్చొని పాట పాడినందుకు చాలామంది అసహనానికి లోనైనట్లు ఉన్నారు.. అందుకు నన్ను క్షమించండి.. జాతీయగీతం అయినా జనగణమనకు లేచి నిల్చుటాం తద్వారా దేశం పట్ల మన గౌరవాన్ని చాటుతాం. కానీ నేను ఆలపించింది జాతీయగేయం వందేమాతరం.. దాన్ని మీరు అందరూ గమనించాలి.. అంతే కాకుండా నాకు కూడా దేశం పట్ల ఎంతో గౌరవం ఉంది అంటూ అనసూయ తనదైన శైలిలో సమాధానమిచ్చింది.

అనసూయ క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చినప్పటికీ ఆమె పై వస్తున్న నెగిటివ్ కామెంట్లు ఆగకపోవడంతో అసహనానికి లోనైనా అనసూయ ఘాటుగా స్పందిస్తూ.. అరేయ్ ఏందిరా బయ్ మీ లొల్లి.. జాతీయ గేయం అంటారు.. గాంధీజీకి రాజ్యాంగానికి సంబంధం ఏమి అంటారు? వందేమాతరం జాతీయ గీతం అనుకుంటే మరి జనగణమన ఏంది? ఆగస్టు 15, 1947 స్వాతంత్ర్యం రాబట్టే జనవరి 26, 1950లో గణతంత్ర దినోత్సవం వచ్చింది. కాబట్టి కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకుని మాట్లాడండి అంటూ కాస్త ఘాటుగా స్పందించింది అనసూయ.