తన భార్య వేరే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే విషయం ఆయనకు తెలిసింది. ఇంతలోనే వారిద్దరు ఇంట్లోనే సహాజీవనం చేస్తుండడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆయన కోపంతో బెడ్ పైనే వారిద్దరి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలి భార్య చనిపోగా వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుని పరిస్థితి విషమంగా ఉంది. అసలు వివరాలు ఏంటంటే…
చేవేళ్లకు చెందిన భాగ్యలక్ష్మీకి దామరగిద్ద గ్రామానికి చెందిన రవితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి పెళ్లికి ముందే చేవేళ్లలో స్థిరపడ్డాడు. భార్య భర్తల మధ్య విబేధాలు రావడంతో కొంత కాలం వేర్వేరుగా ఉన్నారు. భాగ్యలక్ష్మీ చేవేళ్లలోనే ఓ ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటుంది. ఈ క్రమంలో భాగ్యలక్ష్మీకి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం రవికి తెలిసింది.
వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి శనివారం రాత్రి ఆమె దగ్గరకు వచ్చాడని ఆదివారం ఉదయం కూడా ఆమె ఇంట్లోనే ఉన్నాడని రవికి తెలిసింది. దీంతో కోపంతో రగిలిపోయిన రవి ఆదివారం ఉదయం పెట్రోల్ బాటిల్ తీసుకొని ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు కొడుకులను బయటికి తీసుకొచ్చాడు. భాగ్యలక్ష్మీ, యువకుడు బెడ్ రూంలో ఉండడంతో బెడ్ రూం బయట గొల్లం పెట్టి రూంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు రూం అంతా అంటుకోవడంతో భాగ్యలక్ష్మీ , ఆ యువకునికి మంటలు అంటుకున్నాయి. ఆ మంటల్లో కాలిపోయి భాగ్యలక్ష్మీ ప్రాణాలు విడిచింది. ఆ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. రవి ఈ ఘటన తర్వాత పారిపోయాడు. చుట్ట పక్కల వారు వచ్చి చూసే లోపే దారుణం జరిగింది. ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.