మంగళగిరి కాకపోతే, లోకేష్ పోటీ చేసెదక్కడినుంచి.?

2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి వుండగా, ముందస్తు ఎన్నికల ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు నారా లోకేష్. ఈసారి కూడా అదే మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తారన్న ప్రచారమైతే జరుగుతోంది.

కానీ, మంగళగిరి నుంచి పోటీ చేయడం వల్ల ప్రయోజనం లేదంటూ స్థానికంగా టీడీపీ క్యాడర్‌లో ఒకింత నిరుత్సాహం కనిపిస్తోందట నారా లోకేష్ విషయంలో. జాతకాలు, ఇతర సమీకరణాలు.. ఇవన్నీ లెక్కేసుకుంటే, మంగళగిరి ఏ రకంగానూ లోకేష్‌కి కలిసి రాదని అంటున్నారట.

ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయం వైపు ఫోకస్ పెట్టారట నారా లోకేష్. మంగళగిరి కాని పక్షంలో, గన్నవరం ఒకింత సేఫ్ జోన్.. అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. గన్నవరం 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న సీటు. అక్కడి నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, టీడీపీని వీడి, వైసీపీలో చేరిపోయారు.

గన్నవరం వైసీపీలో పెద్ద పంచాయితీ నడుస్తోంది. ఇరువర్గాల మధ్య గొడవ నేపథ్యంలో గన్నవరం వైసీపీ డీలాపడింది. అది టీడీపీకి లాభం చేకూర్చుతుందని తెలుగు తమ్ముళ్ళు నమ్ముతున్నారు.

మరోపక్క, మంగళగిరిలో జనసేనకు విజయావకాశాలు ఎక్కువ వున్నాయని టీడీపీ అంతర్గత సర్వేల్లో తేలుతోందిట. ఈ నేపథ్యంలో జనసేన నుంచి బలమైన అభ్యర్థిని నిలబెడితే, వాపక్షాల మద్దతుతోపాటు, స్థానికంగా కొన్ని సామాజిక వర్గ సమీకరణాలూ జనసేనకు అనుకూలంగా మారతాయని టీడీపీ భావిస్తోందని సమాచారం.