హైపర్ ఆది నోటి దూల కామెంట్, కౌంటర్స్ స్టార్ట్

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ఏపీ ప్రజలు షాకిచ్చిన సంగతి తెలిసిందే. సినిమాల్లో పవర్ స్టార్ గా వెలిగిన ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు. గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో జనసేనానికి కలిసిరాలేదు. గాజువాకలో పవన్‌పై వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి గెలుపొందారు. భీమవరంలో కూడా వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పవన్‌పై విజయం సాధించారు.

ఈ నేపధ్యంలో పవన్ అభిమానులు కొందరు ఆయన ఓటమిపై బాధను వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తుంటే మరి కొందరు ఇది పవన్ కల్యాణ్ ఓటమి కాదు. ప్రజల ఓటమి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక మొదటి నుంచీ పవన్ కు వీరాభిమాని అయిన జబర్థస్ట్ కమెడియన్ హైపర్ ఆది.. ఓడిపోయింది పవన్ కాదు ప్రజలు అంటూ.. పవన్ ఓటమిపై ట్వీట్స్ చేశాడు.

‘‘మనీ, మద్యం ముందు మానవత్వం ఓడిపోయింది. ఈ రోజు ఓడిపోయింది పవన్ కల్యాణ్ కాదు.. తెలుగు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే’’ అంటూ హైపర్ ఆది ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఉక్రోషంతో మాట్లాడుతున్న మాటలు అని జనం అంటున్నారు. రాష్టంలో అందరూ తాగేసి, డబ్బులు తీసేసుకుని వైయస్ జగన్ కు ఓటేసారా… పవన్ కు ఓటేయలేదా..అదే గెలిస్తే మీరు ఇలా మాట్లాడతారా అని నిలదీస్తున్నారు. అలాగే గెలిచిన ఒకచోట కూడా మందు, మనీనే తీసుకున్నారా అని వెటకారం చేస్తున్నారు. ఇలాంటి కామెంట్సే జనసేనను ప్రజలకు దూరం చేసాయంటున్నారు. మరి వీటికి ఆది ఏం సమాధానం చెప్తారో చూడాలి.