ఆలుమగలైనా..ఆ ఇంట్లో రాజకీయాలు వేరు. పార్టీలు..విధి విధానాలు వేరు. భార్యా భర్తలుగా కలిసున్నా ఇద్దరూ వేర్వేరు ధృవాలు. వారే పరకాల ప్రభాకర్- పరకాల నిర్మలా సీతారామన్. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభాకర్ కౌంటర్లు వేసారు. `దేశ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు మైనస్ 23 శాతంగా నమోదు కావడం మన చేతుల్లో లేని ( యాక్ట్ ఆఫ్ గాడ్) కరోనా వల్ల ఇలా జరిగిందని` కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలమ్మ అన్నారు. ఆమె వ్యాఖ్యలకు ప్రభాకర్ ఇలా కౌంటర్ వేసారు.
ప్రభుత్వం సూక్ష్మ, ఆర్ధిక, సవాళ్లపై తగిన విధంగా స్పందింకచకపోవమే అసలైన యాక్ట్ ఆఫ్ గాడ్. కోవిడ్ ఆ తర్వాత వచ్చింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని గత అక్టోబర్ లోనూ ఊహించాను. కానీ ప్రభుత్వం తిరస్కరించినప్పటికీ, తాజాగా జీడీపీ వృద్ధి రేటు పడిపోవడంతో అసలు వాస్తవం తెలిసొచ్చిందన్నారు. ఇప్పటికైనా ఆ దేవుడి కోసం ఏదో ఒకటి చేయండని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ తో ప్రతిపతి పక్షాలకు మంచి స్టప్ దొరికినట్లైంది. పాతాళానికి పడిపోతున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇప్పుడిప్పుడే పైకి లేచే ప్రయత్నం చేస్తోంది.
ప్రియాంక గాంధీ యాక్టివ్ గా పాల్గొనడం..రాహుల్ గాంధీ స్పీడ్ పెంచడం..అమ్మ సోనియా గాంధీ సమావేశాలకు హాజరవ్వడం వంటి సన్నివేశాలతో పార్టీ నేతల్లో నూతనొత్సాహాన్ని నింపినట్లు అయింది. ఇప్పటికే ఆర్ధిక ప్యాకేజీ విషయంలో అసంతృప్తిగా ఉన్న తెలంగాణ సీఎం అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. కరోనా కష్ట కాలంలో ప్రకటించిన ప్యాకేజీపై కేసీఆర్ చేసిన కామెంట్లు తెలిసిందే. మరి ఇప్పుడు ప్రభాకర్ రూపంలో దొరికిన అస్ర్తాన్ని కేసీఆర్ ఎలా వాడతారో చూద్దాం.