తెలుగు రాష్ట్రాల ప్రజలకు కరెంట్ షాక్.. సీఎం జగన్ తప్పేమైనా ఉందా?

దేశంలోని చాలా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో కరెంట్ రేట్లు కొంతమేర తక్కువగానే ఉన్నాయనే సంగతి తెలిసిందే. సీఎం జగన్ వీలైనంత వరకు సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై భారం పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే తాజాగా మోదీ సర్కార్ ప్రతి నెలా విద్యుత్ ఛార్జీలను సవరించే విధంగా నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఫలితంగా ఇకపై విద్యుత్ ఛార్జీల భారం సాధారణ ప్రజలపై మరింత పెరగనుంది.

కేంద్ర ప్రభుత్వం విద్యుత్ నిబంధనలు 2005లో సవరణలు చేయడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కరెంట్ షాక్ తగలడం ఖాయమైంది. అయితే ఏపీలో మాత్రమే కరెంట్ ఛార్జీలు పెరుగుతాయనే విధంగా జగన్ కు వ్యతిరేకంగా ప్రముఖ పత్రికలలో కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. కేంద్రం ఖర్చును బట్టి ఛార్జీలను సవరించుకునే స్వేచ్ఛ డిస్కంలకు ఇచ్చిన నేపథ్యంలో ఇకనుంచి కరెంట్ బిల్లుల మోత మోగనుంది.

కొత్త విధానం వల్ల నెలనెలా కరెంట్ ఛార్జీలు పెరుగుతాయే తప్ప తగ్గవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త విధానానికి సంబంధించి అక్టోబర్ నెల నుంచి తుది ఉత్తర్వులు అమలులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి సమయంలో కరెంట్ ఛార్జీలను పెంచడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఛార్జీలు పెరుగుతున్న స్థాయిలో ప్రజల ఆదాయం మాత్రం పెరగడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం పెరగకపోయినా ఖర్చులు పెరుగుతుండటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మోదీ ప్రభుత్వంపై సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.