తెలుగు రాష్ట్రాల ప్రజలు రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల వల్ల పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలపై భారం కూడా అంతకంతకూ పెరుగుతోందనే సంగతి తెలిసిందే. అయితే విద్యుత్ వినియోగదారులకు మరో భారీ షాక్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర డిస్కమ్‌లు ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చనున్నాయి.
కేంద్ర ఇంధన శాఖ ఆదేశాల ప్రకారం ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చుతున్నామని రాష్ట్ర డిస్కంలు చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం టెలీకాం రంగాంలో ప్రీపెయిడ్ రీఛార్జ్ విధానం అందుబాటులో ఉండగా విద్యుత్ రంగంలో కూడా ఈ విధానం అమలులోకి రానుంది. నగరాలలో నివశించే ప్రజలకు ఈ విధానం వల్ల పెద్దగా నష్టం లేకపోయినా పల్లెల్లో నివశించే వాళ్లు మాత్రం ఈ విధానం వల్ల నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
రాబోయే సంవత్సరంలోగా ఏపీలో విద్యుత్ కనెక్షన్లు ప్రీపెయిడ్ మీటర్లుగా మారబోతున్నాయి. ప్రజలకు కనీసం అవగాహన కూడా కల్పించకుండా మీటర్లను అమర్చడం ఏంటని ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కనీసం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను బిగించడం ఏంటని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఏ విధంగా సమాధానం ఇస్తుందో చూడాల్సి ఉంది. కేంద్రం ప్రస్తుతం డిస్కమ్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ కారణం వల్లే కొత్త విధానాలను అమలులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయడం వల్ల రీడింగ్ తీయాల్సిన అవసరం ఉండదు. అందుకే ఈ విధానం అమలులోకి తెస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికలకు కొన్నినెలల ముందు ప్రభుత్వం అమలులోకి తెచ్చే విధానాల వల్ల ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.