నెల్లూరులో ఏలూరు తరహా టెంక్షన్స్ , 10 మందికి అస్వస్థత , ఒకరు మృతి !

నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెరుబోట్ల పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వెరుబోట్ల పల్లిలో వరి నాట్లు వేయడానికి 70 మంది వలస కూలీలు పశ్చమ బెంగాల్ నుండి‌ వచ్చారు. ఓ రైతు పొలంలో వరినాట్లు వేస్తుండగా అందులో 10 మంది అస్వస్ధకు గురయ్యారు.

ఆస్వస్థతకు గురైన వారిలో ముండా అనే కూలీ కన్నుమూశారు. అలాగే , వారిలో 3 పరిస్ధితి విషమంగా ఉండడంతో నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

మరో మహిళకు చాలా సీరియస్ గా ఉండడంతో బాధిత మహిళల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఏలూరులో జరిగిన ఘటనను గుర్తచేసుకోని‌ మండల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వారిని‌ పరీక్షించిన వైద్యులు మాత్రం ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపారు.దీంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.