ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయాల నందు విజయవాడ రాజకీయాలు రంజు రంజుగా ఉంటాయి . ఎప్పటికప్పుడు అక్కడి రాజకీయాలు వాతావరణాన్ని వేడెక్కిస్తుంటాయి. నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు మీరుతుంటుంది. ఒకర్ని ఒకరు దూషించు కోవడం..తొడగొట్టడాలు..చొక్కాలు విప్పి సవాల్ విసురుకోవడాలు లాంటివి అక్కడ చోటుచేసుకుంటాయి. కొన్ని దశాబ్ధాలగా బెజవాడ రాజకీయాలు అలాగే సాగుతున్నాయి. అందుకే రాష్ర్ట రాజకీయాల నుంచి..సీమ రాజకీయాల నుంచి..బెజవాడ రాజకీయానికి ప్రత్యేకమైన ఓ గుర్తింపు. కొద్ది రోజులు గా వైసీపీ మంత్రి కొడాలి నాని- టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య మాటల యుద్దం పీక్స్ కు చేరుతోన్న సంగతి తెలిసిందే.
నువ్వా? నేనా అంటూ ఇరువురు బాహా బాహాకి దిగుతున్నారు. ఈ విషయంలో కొడాలి నాని కి కాస్త దూకుడు ఎక్కువేనని ఆయన కామెంట్లను బట్టే అర్ధమవుతుంది. ఆయన బూతులు మాట్లాడుతారని..బూతులు మాట్లాడటంలో పీహెచ్ డీ చేసాడని టీడీపీ నాయకులు పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నాని ఎన్నిసార్లు..ఎన్నెన్ని రకాలుగా ధ్వజమెత్తారో చెప్పాల్సిన పనిలేదు. సందు దొరికినప్పుడల్లా అందుకోవడంలో నానిదే పై చేయి. ఇటీవలే చంద్రబాబుని బిచ్చగాడని కూడా ఆక్షేపించారు. దీనికి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో నాని ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని ఉమాని హెచ్చరించారు. దేవినేని తండ్రి బెజవాడ రోడ్డు మీద షోడాలు అమ్ముకోలేదా అని..తనని లారీ క్లీనర్ అన్నారని, ఎవరో ఒక లారీ డ్రైవర్ లారీ లా క్లీనర్ కంచికచర్ల హైవేపై నిన్ను తొక్కిస్తారని కొడాలి మండిపడ్డారు. దీనికి దేవినేని కౌంటర్ గా బూతులు మంత్రి ఎవరో రాష్ర్ట ప్రజలకు తెలుసునని..నోరు విప్పితే బూతు పురాణం తప్ప మరో మంచి మాటరాని మంత్రి ఎవరో అందరికీ తెలుసునని దేవినేని ధ్వజమెత్తారు.