హిందూపురం.! ఈసారి బాలయ్య కాదా.?

బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు.. టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారాయన ప్రస్తుతం.! అయితే, నియోజకవర్గ ప్రజలకు అస్సలు అందుబాటులో వుండరన్న విమర్శ ఆయన మీద వుంది.

గతంలోనే.. అంటే, 2019లోనే నందమూరి బాలకృష్ణ మీద తీవ్ర వ్యతిరేకత కనిపించింది. కానీ, జగన్ వేవ్‌లో కూడా బాలయ్య తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎలాగోలా గట్టెక్కేశారు. కానీ, వచ్చే ఎన్నికల్లో బాలయ్య మళ్ళీ గెలిచే అవకాశమే లేదట. టీడీపీ ఇప్పటిదాకా పలు సర్వేలు నిర్వహిస్తే, అందులో ఒక్కటీ హిందూపురంలో బాలయ్య గెలుపు గురించి ఎలాంటి సంకేతాలూ ఇవ్వలేదని తెలుస్తోంది.

ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ స్వయంగా సొంత సర్వే చేయించుకున్నారన్నది తాజా ఖబర్. తన స్థానంలో తన భార్యని నిలబెడితే ఎలా వుంటుంది.? అని కూడా బాలయ్య సమాలోచనలు చేస్తున్నారట సన్నిహితులతో.

బాలయ్య కోసం ఆయన సతీమణి వసుంధర కూడా 2019 ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేశారు.. అదీ హిందూపురం నియోజకవర్గంలో. బాలయ్య కంటే కూడా ఎక్కువ బాగా జనంతో ఆమె ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆమె పట్ల కొంత సానుకూలత, హిందూపురం నియోజకవర్గంలో వుందట.

కానీ, బాలయ్య అభిమానులు మాత్రం మళ్ళీ బాలయ్యే పోటీ చేస్తారు.. అని తెగేసి చెబుతున్నారు. వసుంధరని రంగంలోకి దించే విషయమై చంద్రబాబు కూడా సానుకూలంగానే వున్నారట. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. భర్త కోసం ప్రచారం చేయడం వరకూ ఓకే. భర్త పోటీ చేయకపోతే, ఆ స్థానంలో పోటీ చేసేంత తెగువ బాలయ్య సతీమణి చూపిస్తారా.? వేచి చూడాల్సిందే.