హైడ్రామా ముగిసింది.! చంద్రబాబుకి రిమాండ్.!

రిమాండ్ తప్పలేదు.! చంద్రబాబు జైలుకు వెళ్ళక తప్పేలా లేదు. బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు చంద్రబాబు తరఫు లాయర్లు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారంలో.. చంద్రబాబు తప్పించుకోలేకపోయారు. ‘వ్యస్థల్ని మేనేజ్ చేస్తారు.. మేనిప్యులేట్ చేస్తారు..’ అనే గుర్తింపు వున్న చంద్రబాబు, ‘రిమాండ్’ తప్పించుకోలేకపోవడం ఆశ్చర్యకరం.

అరెస్టువతానని తెలిసే, ఆ విషయాన్ని రెండ్రోజుల ముందే చెప్పేసుకున్న చంద్రబాబు.. అరెస్టుని తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ క్వశ్చనే.! నిన్న ఉదయం అరెస్టయిన చంద్రబాబు విషయంలో, నేటి సాయంత్రం వరకూ హైడ్రామా నడిచింది.

నంద్యాలలో అరెస్టయిన చంద్రబాబు, అసలు రోడ్డు మార్గంలో విజయవాడకు ఎలా తరలించబడ్డారు.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్. విమానంలోనో, హెలికాప్టర్‌లోనో ఆయన్ని తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే చంద్రబాబు ససెమిరా అన్నారట. అసలు అలా కుదురుతుందా.?

అరెస్టు చేసింది సీఐడీ.! ప్రభుత్వమెలా ప్రత్యేక విమానమో, హెలికాప్టరో ఏర్పాటు చేస్తుంది.? ఏక్కడో ఏదో తేడా కొడుతోంది. బోల్డన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాత్రంతా ఏపీసీఐడీ కిందా మీదా పడింది.. చంద్రబాబుని సుదీర్ఘంగా విచారించింది సీఐడీ. చంద్రబాబు నోరు తెరవలేదట.

పొద్దున్నే న్యాయస్థానానికి చంద్రబాబుని తరలించింది సీఐడీ. ఢిల్లీ నుంచి సీనియర్ మోస్టు లాయర్లూ రంగంలోకి దిగారు. యాభై కోట్ల పైనే ఖర్చట.! కానీ, ఇదేదీ చంద్రబాబు రిమాండుని కాపాడలేకపోయింది. బెయిల్ వస్తుందా.? రాదా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అది న్యాయస్థానం పరిధిలోని అంశం.