ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు తాజా ఝలక్.!

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామినిక చెందిన 14 మందికి హైకోర్టు గతంలో లక్ష రూపాయల చొప్పున జరీమానా విధించిన సంగతి తెలిసిందే. రహదారి విస్తరణ పేరుతో అధికారులు తమ ఇళ్ళు, ప్రగహరీ గోడల్ని కూల్చివేస్తున్నారనీ, వాటిని ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఇప్పటం గ్రామినిక చెందిన 14 మంది గ్రామస్తులు.

తొందరపాటు చర్యలు వద్దని అధికారుల్ని ఆదేశిస్తూ హైకోర్టు అప్పట్లో మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. కాగా, పిటిషనర్లందరికీ షోకాజ్ నోటీసు ఇచ్చామనీ, వారు ఆ విషయాన్ని అఫిడవిట్‌లో పేర్కొనలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది తమ వాదనను వినిపించడంతో, అది నిజమేనని గ్రామస్తులు ఒప్పుకున్నారు.

హైకోర్టు అక్షింతలు.. జరీమానా.!
హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పిటిషన్ దారులకు హైకోర్టు లక్ష రూపాయల చొప్పన జరీమానా విధించింది. సింగిల్ జడ్జి  ఆదేశాల్ని సవాల్ చేస్తూ రైతులు రిట్ పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని హైకోర్టు తాజాగా తోసిపుచ్చింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటంలో కూల్చివేతల వ్యవహారంపై హై పొలిటికల్ డ్రామాకి తెరలేపిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఇప్పటం గ్రామంలో కూల్చివేతల బారిన పడ్డ బాధితులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని కూడా జనసేనాని ప్రకటించారు. గతంలో తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భూములు ఇచ్చినందువల్లనే ఇప్పటం గ్రామంపై ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగిందనీ, ఈ నేపథ్యంలోనే రోడ్ల వెడల్పు అనే కుంటి సాకు చెప్పి ఇళ్ళను కూల్చివేశారన్నది జనసేనాని ఆరోపణ. మరిప్పుడు, ఆ గ్రామస్థుల పరిస్థితేంటి.? జరీమానా కట్టి తీరాల్సిందేనా.? వేచి చూడాల్సిందే.