వివేకా హత్య కేసు … వాళ్లకు శిక్ష పడుతుందా?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వేగవంతంగా దర్యాప్తు చేయడంతో ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, ఉమా శంకర్, దస్తగిరి ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్నారు. వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు వినిపించగా ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధమైందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ నిందితులకు హైకోర్టు బెయిల్ తిరస్కరించడం గమనార్హం.

హైకోర్టు న్యాయమూర్తి రమేష్ ఈ కేసు విచారణ సందర్భంగా వ్యక్తిగత స్వేచ్ఛ అత్యంత ప్రాధాన్యమైనదే అని అయితే వైఎస్ వివేకా హత్య కేసు తీవ్రత, ముగ్గురు నిందితుల నేర చరిత్ర, నిందితులపై ఉన్న ఇతర కేసులు, అభియోగాలు, కేసు పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ కేసు నిందితులకు బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఈ నేతలు అత్యంత రాజకీయ పలుకుబడి ఉన్న నేతలు కావడం గమనార్హం.

గతంలో ఈ నిందితులు సాక్షులను బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నిందితులు నేర చరిత్ర కలిగి ఉన్న వ్యక్తులు కావడం గమనార్హం. ఈ కేసును ఏళ్లకు ఏళ్లు సాగదీయడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఇంకా మరి కొందరి ప్రమేయం ఉందని దోషులకు కఠిన శిక్షలు విధించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ అధికారులకు అధికార పార్టీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

వివేకానందరెడ్డి కూతురు సునీత ఈ కేసులో నిందితులకు శిక్ష పడటానికి ఎంతో కష్టపడుతున్నారు. ప్రధాన నిందితులైన ఈ ముగ్గురు వివేకా కేసులో సాక్ష్యాధారాలను సైతం మాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ సైతం వివేకా హత్య కేసుపై దృష్టి పెట్టిందని బోగట్టా. సీబీఐ ఈ కేసులో విచారణను వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తుండటంతో పలువురు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.