సినిమా రంగంలో అందరూ అనుకున్నంత మంచిగా ఉండదని చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇటివల చాలామంది నటులు ఇంటర్వ్యూలలో చెప్పారు. ముఖ్యంగా హీరోయిన్స్ డ్రెస్ చేంజ్ చేసుకునేందుకు ఒక్కోసారి కేర్ వ్యాన్తు కూడా ఉండవట. ఏ చెట్టు చాటుకో, కారు చాటులో దుస్తులు మార్చుకుంటారట. తాజగా అటువంటి దుస్థితే ఓ హీరోయిన్ కు ఎదురైంది.
కోలీవుడ్ యంగ్ హీరోయిన్ సృష్టి డాంగే 2010లో విడుదలైన కాదలి అనే సినిమా ద్వారా సిని ప్రవేశం చేశారు. ప్రస్తుతం మళమాలం సినిమాల్లోనూ నటిస్తోంది. కోలీవుడ్ నటుడు కదిర్ హీరోగా నటించే శత్రు అనే సినిమాలో సృష్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఆడియో విడుదల ఇటీవల జరిగింది. ఈ ఫంక్షన్ లో హీరోయిన్ గొప్పతనాన్ని దర్శకుడు కొనియాడారు.
ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం హీరోయిన్ 20 కాస్టూమ్స్ మార్చాల్సి వచ్చిందని, కేర్ వ్యాను లేకపోయినా పబ్లిక్ టాయిలెట్ లో దుస్తులు మార్చుకొని సన్నివేశాన్ని పండించిందన్నారు. సృష్టిలోని అంకిత భావానికి శభాష్ అంటూ ఆయన స్టేజిపై కొనియాడారు. దీంతో అంతా హీరోయిన్ ను శభాష్ అంటున్నారు. హీరోయిన్ అంటే అంతా గొప్పగా ఫీల్ అవుతారని కానీ సృష్టి సింప్లిసిటి, అర్ధం చేసుకునే గుణం గొప్పదని అంతా చర్చించుుకున్నారు.