వైసీపీ లో ఆయన ఒంటరి అయ్యాడు .. వైఎస్సార్ ఉన్నప్పుడూ ఇలాగే జరిగిందా?

ysrcp leaders aggressive on mps and mlas of them
వైసీపీ అధికారంలోకి వ‌చ్చినా  ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకి ఎలాంటి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌క‌పోవ‌డంపై ఏడాది కాలంగా క‌థ‌నాలు వెలువ‌డు తూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాల్లో రాజ‌కీయంగా బ‌ల‌మైన నేత‌. మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం. వైఎస్సార్ హ‌యాంలో నూ మ‌హానేత తో క‌లిసిన నేత‌. ఇలా ధ‌ర్మాన ది-వైఎస్ ఫ్యామిలీతో విడ‌దీయ‌రాని బంధ‌మే. కానీ ప్ర‌సాదారావుకి మాత్రం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన ప‌దవి ద‌క్క‌లేదు. అయితే ఆ స్థానంలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు త‌మ్ముడు కృష్ణ‌దాస్ కి ద‌క్కింద‌ని..ఇదంతా ప్ర‌సాద‌రావు త్యాగ‌మ‌నే  క‌థ‌నాల్ని మీడియా వేడెక్కించింది.
dharmana brothers
dharmana brothers

ఇద్ద‌రిలోనూ ఒకరికి మంత్రి ఆఫ‌ర్ ఉంద‌ని జ‌గ‌న్ ప్ర‌పోజ‌ల్ పెట్టిన‌ప్పుడు అప్ప‌టికే మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ప్ర‌సాద్ రావుకి ఉంది కాబ‌ట్టి ఈసారి ఆ ఛాన్స్ త‌మ్ముడికి తానే ఇచ్చిన‌ట్లుగా జిల్లాల్లో చెప్పుకుంటారు. మొన్న‌టి వ‌ర‌కూ రెవెన్యూ మంత్రిగా ఉన్న కృష్ణ‌దాస్ ఇప్పుడు ఉప‌ముఖ్య‌మంత్రిగా కూడా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక అదే జిల్లాకు చెందిన త‌మ్మినేని సీతారాంని స్పీక‌ర్ చేయ‌డం గురించి తెలిసిందే. ఇలా వైసీపీ ప‌క్ష‌పాత వైఖ‌రిని చూపించిన‌ప్ప‌టికీ ప్ర‌సాద‌రావు  ఏ సంద‌ర్భంలోనూ అసంతృప్తిని వ్య‌క్తం చేసే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అయితే ఇటీవ‌లే  అదే జిల్లాకు చెందిన‌ సిదిరి అప్ప‌ల రాజుని మంత్రిగా పీఠం ఎక్కించిన సంగ‌తి తెలిసిందే.

ఈ విష‌యంలో మాత్రం ధ‌ర్మాన బాగా హర్ట్ అయ్యార‌నే కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. త‌మ్మినేని..అన్న‌య్య విష‌యంలో లైట్ తీసుకున్నా అప్ప‌ల‌రాజుని మంత్రిని చేయ‌డంతో ప్ర‌సాద‌రావు లోలోప‌ల ర‌గిలిపోతున్న‌ట్లు పొలిటిక‌ల్ కారిడార్ లో చ‌ర్చ‌కొచ్చింది. ఈ నేప‌థ్యంలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పార్టీకి..జిల్లాకు దూరంగా ఉంటున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. పార్టీ ప‌రంగా ఎలాంటి కార్య‌క్రమాలు జ‌రిగినా ప్ర‌సాద‌రావు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని..త‌న ప‌ని తాను చూసుకోవ‌డం త‌ప్ప రాజ‌కీయంగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని వినిపిస్తోంది.