తెలంగాణ రాష్ట్రంలో వైసీపీని కొనసాగించే అవకాశం ఉన్నా పార్టీని ఏపీకి మాత్రమే పరిమితం చేయాలని భావించి జగన్ ఆ దిశగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణపై విమర్శలు చేసే చేసే అవకాశం ఉన్నా జగన్ ఎప్పుడూ విమర్శలు చేయలేదు. జగన్ తెలంగాణ విషయంలో వ్యక్తిగత విమర్శలు చేయడానికి ఆసక్తి చూపలేదనే సంగతి తెలిసిందే. అయితే జగన్ ఎంత మంచిగా ఉన్నా కొంతమంది మాత్రం ఆయనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా లేరంటూ తాజాగా హరీష్ రావు చేసిన కామెంట్లు హాట్ టాపిక్ ఆయ్యాయి. అయితే ఇదే విధంగా తెలంగాణ విషయంలో ఏపీ మంత్రులు , జగన్ విమర్శలు చేస్తే హరీష్ రావు తట్టుకోగలరా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాలలో అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే సంగతి తెలిసిందే.
తెలంగాణలో ఇప్పటికీ వైఎస్సార్ ను అభిమానించే అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. తెలంగాణ నేతలు జగన్ సర్కార్ పై వ్యతిరేకంగా కామెంట్లు చేయడం వల్ల ఆ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదనే సంగతి తెలిసిందే. మునుగోడు ఎన్నికతో పాటు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీపై చేసే నెగిటివ్ కామెంట్లు ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది.
జగన్ ఈ విమర్శలకు ఘాటు రియాక్షన్ ఇస్తే మాత్రం పొయ్యేది టీ.ఆర్.ఎస్ పార్టీ పరువేనని చెప్పవచ్చు. కేసీఆర్ జాతీయ పార్టీని మొదలుపెట్టనున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణలు కచ్చితంగా మారతాయి. ఇలాంటి సమయంలో ఇతర పార్టీలతో కయ్యానికి కాలు దువ్వడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని హరీష్ రావు, కేసీఆర్ గుర్తుంచుకుంటే మంచిది.