అక్కరకు రాని అనుభవం దేనికయ్యా జోగయ్య?

వయసుతో పాటు అనుభవం వస్తుందేమో కానీ.. అనుభవంతో జ్ఞానం రావాలని రూలేమీ లేదు. వస్తుందని కన్ ఫాం కూడా కాదు. ఏపీలో ఇప్పుడు రాజకీయాలు కాపు సమాజికవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్, ముద్రగడ ల మధ్య వ్యవహారం పీక్స్ కి చేరింది. ఈ సమయంలో తగుదునమ్మా అంటూ ఎంటరయ్యారు హరిరామ జోగయ్య.

ప్రస్తుతం వారాహి యాత్ర అంటూ ఏపీలోని గోదావరి జిల్లాలో తిరుగుతున్న పవన్ కల్యాణ్.. ముద్రగడను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు యువతను ఉపయోగించుకుని ఎదుగుతుతున్నారంటూ వ్యాఖ్యానించారు. పవన్ ఇలా ముద్రగడ గురించి మాట్లాడటం వల్ల.. ఆయన్ని సైతం విమర్శించడం వల్ల.. కాపులకు తానొక్కడినే నాయకుడిని, కాపులంతా ఇకపై తనవెంటే నడవాలి అని చెప్పే ఉద్దేశ్యం ఉండి ఉండొచ్చు.

అయితే గత నలభై ఏళ్లుగా ఎన్నో కాపు ఉద్యమాల్లో కీలక భాగస్వామిగా ఉంటూ, మరికొన్ని కాపు ఉద్యమాలను లీడ్ చేస్తూ ముందుకుపోతున్న ముద్రగడపై.. పవన్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. పవన్ పై ముద్రగడ గతంలో ఏనాడూ స్పందించింది లేదు.. పవన్ ప్రస్థావన కూడా ఆయన మాటల్లో ఎక్కడా వినిపించలేదు. అయినా కూడా పవన్ కెలుక్కున్నారు.

ఫలితంగా తన అనుభవాన్ని, తన వెటకారాన్ని రంగరించి ముద్రగడ.. పవన్ కు ఒక లేఖ రాశారు. ప్రశ్నిస్తున్నారో సూచిస్తున్నారో తెలియకుండా కడిగిపారేశారు. ఫలితంగా… పవన్ ను అన్ని రకాలుగానూ ఇరుకున పెట్టేశారు. అయితే ఈ విషయాలపై కచ్చితంగా జనసేన నుంచి ప్రతిస్పందన వస్తుందని అంతా భావించారు. స్పందించాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. కానీ… పవన్ తనకు అలవాటైన శైలిలోనే.. ఏ ఊరిలో మాటలు ఆ ఊరికే అన్నట్లుగా వదిలేశారు.

ఈ సమయంలో కాపుసేన అంటూ పనిచేస్తున్న హరిరామ్మ జోగయ్య మైకులముందుకు వచ్చారు. ముద్రగడపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముద్రగడపై తనకున్న గౌరవం పోయిందని చెప్పుకొచ్చారు. కానీ… ఈ రచ్చలో మొదట కెలికింది పవనే అనే విషయం ఇతర కాపు జనాలకు తెలియదని అనుకున్నట్లున్నారు. పెద్దమనిషిగా రెండు వైపులా మాట్లాడుతూ.. “ఇలాంటి సమయంలో సామాజికవర్గంలో విభజన తీసుకురావొద్దు.. సంయమనం పాటించండి.. రాజకీయాలకు కులంలోని ఐక్యతను పాడుచేయొద్దు.. కుదిరితే కుర్చుని మాట్లాడుకోండి” అని స్పందించాల్సిన ఆయన… ముద్రగడ వైపు వన్ సైడ్ తీసేసుకున్నారు.

ముందుగా దాడి చేసిన పవన్ వైపు నిలబడ్డారు. పవన్ చేసిన విమర్శలపై స్పందించిన ముద్రగడను జోగయ్య విమర్శించారు. దీంతో… కాపులను నిట్టనిలువునా చీల్చడంలో జోగయ్య సైతం ఒక చెయ్యి వేశారని.. అక్కరకు రాని అనుభవం ఎందుకయ్యా జోగయ్య అంటూ తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు నెటిజన్లు. తన అనుభవం సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావాల్సింది పోయి.. బీటలు వాలుతున్న దాన్ని పూర్తిగా ధ్వసం చేసేలా చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.