వారాహి యాత్ర రెండో దశ మొదటి సభ ఏలూరులో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో మైకందుకున్న పవన్… ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో పవన్ పై మంత్రి అమరనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అవును… ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాఖ్యలపై మైకందుకున్న మంత్రి అమరనాథ్… సీరియస్ గా స్పందించారు. పవన్ ఉన్మాదిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు పవన్ చెబుతున్నవి కాగ్ లెక్కలా.. లేక, చంద్రబాబు లెక్కలా అని ఎద్దేవా చేశారు!
ఇదే సమయంలో నిత్య కళ్యాణాలతో పవన్ తన పేరును సార్థకం చేసుకున్నారని వ్యాఖ్యానించిన మంత్రి… “ఎక్కడ ఎవరికి తాళి కట్టేస్తాడో..” అని ఆడపిల్లలు పవన్ ను చూసే భయపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి.
అనంతరం ఇదే ఫ్లో కంటిన్యూ చేసిన మంత్రి… “చంద్రబాబు ఇచ్చే స్క్రిప్టు చదువుతూ ప్యాకేజీ తీసుకోవడం కోసమే ఈ వారాహి యాత్రలా అని మంత్రి నిలదీసారు. చంద్రబాబుకు సేనాధిపతిగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జనసేనను టీడీపీలో కలిపేస్తే.. ప్యాకేజీ ఆగిపోతుందని భయమా అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా పవన్ మూడో భార్య గురించి రాతలు రాసింది టీడీపీ అనుకూల మీడియాలోనే అని గుర్తుచేసిన అమరనాథ్… పవన్ కల్యాణ్ తీవ్ర నిరాశతో ఉండి మాట్లాడుతున్నారని అన్నారు. రాజకీయంగా ఎదగలేనని, తనకు ఎవరూ ఓట్లు వేయరని, ఎమ్మెల్యేను కూడా కాబోనని, తానసలు రాజకీయాలకు పనికి రానని ప్రజలు అనుకుంటున్నారన్న ఆవేదన, బాధలో పవన్ ఉన్నట్లున్నాడని.. అందువల్లే ఉన్మాది మాదిరిగా మాట్లాడుతున్నాడని మంత్రి విమర్శించారు.
ఇదే క్రమంలో… తనకు భయం లేదని చెప్పే పవన్ ధైర్యంపై అమరనాథ్ కీలక సవాల్ విసిరారు. ధమ్ముంటే.. ధైర్యముంటే.. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పాలని సవాల్ విసిరారు. అనంతరం.. పవన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే చెప్పులు చూపిస్తారని మంత్రి హెచ్చరించారు.