పుట్టా పాపాలు బద్దలవ్వాల్సిందేనా ?

చూడబోతే అలాగే ఉంది పుట్టా సుధాకర్ యాదవ్ వ్యవహారం. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ గా నియమితులైన పుట్టా ఆ పదవి నుండి దిగిపోవటానికి ససేమిరా  అంటున్నారు. ప్రభుత్వం మారగానే  పదవులకు చాలామంది రాజీనామాలు చేస్తున్న పుట్టా మాత్రం ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నారు.

టిటిడి ఛైర్మన్ గా తాను రాజీనామా చేసేది లేదని చెబుతున్న పుట్టా తనను పదవి నుండి ప్రభుత్వం తొలగిస్తే కానీ పోనంటు భీష్మించుకు కూర్చున్నారు. ప్రభుత్వాలు మారగానే పదవులకు రాజీనామాలు చేయటం కేవలం నైతిక అంశం మాత్రమే. సరే అదే ఉంటే పరిస్ధితి ఇంతదాకా ఎందుకు తెచ్చుకుంటురు లేండి.

ఆర్డినెన్సు జారీ ద్వారా పుట్టాను తొలగించాలని అనుకున్నా అందులో లీగల్ సమస్యలున్నాయని మానుకున్నారట. తాజాగా పుట్టాపైన ఉన్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.

మామూలుగా అయితే పదవుల నుండి తప్పుకోవటమంటే మర్యాదగా ఉంటుంది. విచారణలు, కేసుల వరకూ తెచ్చుకోవటమంటే పరిస్దితి చాలా దిగజారిపోయినట్లే. ఇపుడు పుట్టాపై విచారణ, కేసులంటే అప్పుడు పదవి నుండి తొలగించటమే కాదు ఏకంగా జైలుకే పంపుతారేమో ?