YS Jagan: గోరంట్ల మాధవ్ కి కీలక పదవి… వైఎస్ జగన్ తప్పులను సరిదిద్దుకుంటున్నారా?

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష నేత హోదాను కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే .ఇలా 2019 ఎన్నికలలో ఈయన ఏకంగా 151 స్థానాలలో సింగిల్గా పోటీ చేసి గెలిచారు అయితే ఈ ఎన్నికలలో మాత్రం ఈయన కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఒక్కసారిగా వైకాపా నేతలు కార్యకర్తలు షాక్ లో ఉన్నారు. ఇకపోతే ఎన్నికలలో ఘోరంగా ఓటమిపాలు అయినటువంటి వైయస్ జగన్ ఇప్పటినుంచే తన కేడర్ అలాగే కార్యకర్తలు అందరిని కూడ కలుపుకొని వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక సంక్రాంతి తర్వాత ఈయన జిల్లాల బాట పట్టబోతున్న విషయం తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ రెండు రోజులపాటు బసచేయడమే కాకుండా అక్కడ నేతలు కార్యకర్తలతో కూడా సమావేశం కాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రతి జిల్లా కార్యకర్తలు నేతలతో సమావేశం అవుతూ నేతలకు దిశా నిర్దేశాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అనంతపురం జిల్లా నేతలు కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నేతలందరికీ కొన్ని దిశా నిర్దేశాలు చేశారు. అదేవిధంగా గతంలో ఎంపీగా పనిచేసినటువంటి గోరంట్ల మాధవ్ కు ఈసారి ఈయన కీలక బాధ్యతలు ఇచ్చారని తెలుస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి గోరంట్ల మాధవ్ కు 2019 సంవత్సరంలో ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి గెలిపించారు అయితే కొన్ని వివాదాల కారణంగా గోరంట్ల మాధవ్ కు 2024 ఎన్నికలలో టికెట్ ఇవ్వలేదు.

ఇలా ఎంతోమంది సీనియర్లను పక్కన పెడుతూ కొత్తవారికి టికెట్ ఇవ్వటం వల్లే ఈయనకు 2024లో ఫలితాలు అలా వచ్చాయని కొంతమంది వాదన అయితే ఈ విషయంలో పొరపాట్లు తెలుసుకున్న జగన్ తిరిగి సీనియర్లను, బాగా పాపులారిటీ ఉన్న నాయకులను దగ్గర చేర్చుకుంటున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలను అప్పగించారని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని నిన్న ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ అధికారికంగా వెల్లడించడమే కాకుండా ఈయనకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.