ఏపీ సీఎం చంద్రబాబు రుణమాఫీ రైతులకు మరో శుభవార్త చెప్పారు. ఇటీవల కేబినేట్ బేటిలో రైతులకు వరాల జల్లు ప్రకటించిన చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తామని 2014 ఎన్నికల సమయాన హామీనిచ్చారు. అయితే ఆ హామీ ప్రకారం మూడు విడతలుగా కొంత రుణ మాఫీ చేశారు.
అయితే మరో రెండు విడతల్లో పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. 4వ, 5వ విడత చెల్లింపులను ఎన్నికల్లోపే పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మార్చి 4 లోపు నాలుగవ ఇన్ స్టాల్ మెంట్ ను, ఏప్రిల్ ఆఖరి వారంలో చివరి ఇన్ స్టాల్ మెంట్ ను ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన నిధులను వెంటనే సిద్దం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఇటీవలనే కేబినేట్ బేటిలో ఎంత భూమి ఉన్నా సరే రైతులకు కేంద్రం ఇచ్చే 6 వేలకు మరో నాలుగు వేలు కలిపి 10 వేల రూపాయలు పంట సాయం కింద ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు రుణమాఫీని తొందరగా చేస్తామని ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.