మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు

మహిళా ప్రభుత్వం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పిల్లల సంరక్షణ కోసం తీసుకునే సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచింది. . 11వ వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగుల సెలవులను పెంచుతున్నట్లు ప్రభుత్వ ఆర్థిక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్ క్యాజువల్ సెలవులు, కొన్ని జబ్బులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులు సెలవు రోజులకు కూడా పూర్తి జీతం పొందవచ్చు.