జగన్ కు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో ఒకపక్క అధికార ప్రతిపక్షాల మధ్య రసవత్తర రాజకీయ పోరు నడుస్తున్నవేళ.. జగన్ కు కేంద్రంనుంచి వరుస గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెవిన్యూ లోటు, పోలవరం నిధులు అంటూ భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ మరోసారి చిన్నపాటి సాయం చేసింది.

అవును… వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి… ఏపీ సీఎం జగన్, కేంద్రప్రభుత్వానికి ఏనాడూ వ్యతిరేకం కాలేదు! ఫలితంగా రావలసిన నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం లభించింది. విభజన హామీలు అమలు చేయకపోయినా… ఎప్పటికప్పుడు నిధులిస్తూ సహకరిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఏపీ ప్రభుత్వం వినతిని అంగీకరించింది.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ను సరఫరా చేసేందుకు వీలుగా వేసిన విద్యుత్ లైన్లకు ఆయా రాష్ట్రాలు ట్రాన్స్ కోకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏపీలో 2014 నుంచి దీనికి సంబంధించిన బాకాయిలు వసూలు కాలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మొదలైన ఈ బకాయిలు.. జగన్ అధికారంలోకి వచ్చాక కూడా ఇంకా కొనసాగుతోన్నాయి. దీంతో… ఈ బకాయిలను ఆయా రాష్ట్రాల నుండి ఇప్పించాలని జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది!

2014-15 నుంచి 2018-19 వరకూ వసూలు కావాల్సిన ఈ ఛార్జీలను రాష్ట్రాలనుంచి ఇప్పించాలని ఈ మేరకు జగన్ సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీ వినతిపై విచారణ జరిపి ఈ రూ.114 కోట్ల ఛార్జీల బకాయిల వసూలుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అయితే… ఈ మొత్తం కొంతే అయినా.. విద్యుత్ సంస్ధల ఆర్ధిక పరిస్ధితి దృష్ట్యా చూస్తే మాత్రం ఇది పెద్ద మొత్తమే అని అంటున్నారు పరిశీలకులు.

ఏది ఏమైనా… చిన్నా మొత్తమైనా, పెద్ద మొత్తమైనా… ఏపీ వినతుల విషయంలో కేంద్రం మాత్రం సానుకూలంగానే స్పందిస్తుండటం జగన్ సర్కార్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి!