అమరావతి విషయంలో జగన్ కు గుడ్ న్యూస్.. విపక్షాలకు బ్యాడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ సర్కార్ కు కేంద్రప్రభుత్వం వరుసపెట్టి గుడ్ న్యూస్ లు చెబుతుంది. జగన్ వేసుకున్న అన్ని ప్లాన్లూ సక్సెస్ ఫుల్ గా పూర్తవ్వడానికి తనవంతు సహాయం చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్ధికపరమైన సహాయ సహకారాలు జగన్ సర్కార్ కి అందించిన కేంద్ర ప్రభుత్వం… తాజాగా అమరావతి విషయంలో కూడా జగన్ కు గుడ్ న్యూస్ చెప్పింది.

అవును… రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్లను నిర్మించాలని భావిస్తున్న జగన్ సర్కారు నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం దన్నుగా నిలిచింది. ఆర్ 5 జోన్ లో కట్టాలని భావిస్తున్న 47 వేల ఇళ్లకు కేంద్రంలోని సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీలో అనుమతులు ఇస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికోసం జగన్ చేసుకున్న వినతిని నెలరోజుల్లోనే పూర్తిచేసి.. కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

అమరావతిలో రాజధానేతరులైన 50,793 మందికి జగన్ సర్కార్ ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో 47 వేల మందికి కేంద్రం ఇళ్లు మంజూరు చేయగా.. మిగిలిన ఇళ్ల నిర్మాణానికి తదుపరి సమావేశంలో అనుమతులు ఇస్తామని పేర్కొంది. అయితే తాజాగా ఈ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు లభించిన నేపథ్యంలో జులై 8న ఇళ్ల నిర్మాణానికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టనుందని తెలుస్తుంది.

అయితే ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఎన్నికలకంటే ముందుగానే ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగా… వేగంగా నిర్మాణ పనులు జరిగేందుకు వీలుగా షియర్ వాల్ టెక్నాలజీని వినియోగించనున్నారని సమాచారం. దీంతో… వచ్చే ఎన్నికల నాటికి 47వేల ఇళ్లు పూర్తి కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే ఈ పరిణామం విపక్షాలకు మాత్రం మింగుడుపడనిదని చెప్పడంలో సందేహం ఉండకపోవచ్చు.