జగన్ ఒకటి తలిస్తే.. జీవో ఇంకొకటి తలుస్తుంది!

తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలియదు కానీ.. జీవో నెం1 పేరు చెప్పి తప్పు మీద తప్పు చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్! మెజారిటీ అంశల్లో చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని పేరున్న జగన్.. కొన్ని విషయాల్లో మాత్రం బేసిక్ లాజిక్కులు కూడా మరిచిపోతున్నారు. ప్రస్తుతం వైకాపా శ్రేణుల ఆందోళన ఇదే!

అవును… యువగళం పేరు చెప్పి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. కష్టమో సుఖమో తనమానాన్న తాను నడుచుకుంటూ, తనకు వచ్చినంతలో మాట్లాడుకుంటూ యాత్ర కొనసాగిస్తున్నారు. అలా సైలంట్ గా సాగిపోతున్న యాత్రకు జీవో నెం1 పేరు చెప్పి.. మైకులు లాగి, కుర్చీలు లాగి.. పసుపు మీడియాకు ఫుల్ కంటెంట్ ఇస్తున్నారు జగన్!

దీంతో.. తనను చూసి వైకాపా నేతలు భయపడిపోతున్నారని, జగన్ అయితే వణికిపోతున్నారని లోకేష్ క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో… లోకేష్ ని తనమానాన్న తనని వదిలేయక ఎందుకో పోలీసులను ఉపయోగించి హీరోని చేస్తున్నారని ఫీలవుతున్నారు వైకాపా శ్రేణులు!

ఇదే క్రమంలో… ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టూర్ చేస్తున్న చంద్రబాబు అనపర్తి సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు! దీంతో… ఆ సందర్భాన్ని క్యాష్ చేసుకునే పనికి పూనుకున్న బాబు… కాన్వాయి ని పక్కన పెట్టి ఏకంగా కాలి నడకన సుమారు ఆరు కిలోమీటర్ల దూరం నడచివెళ్లారు! దీంతో… స్థానికంగా ఈ విషయం స్ప్రెడ్ అవ్వడంతో.. జనాలు తండోప తండాలుగా వచ్చారు.. ఫలితంగా బాబు గారి అప్రకటిత పాదయాత్రకు ఫుల్ మైలేజ్ వచ్చినట్లయ్యింది!

ఇలా లోకేష్ – చంద్రబాబులు వారిమానాన్న వారు పాదయాత్రలో, కాన్వాయ్ యాత్రలో చేసుకుంటుంటే.. జీవో నెం 1 పేరు చెప్పి… తండ్రీ కొడులను హీరోలను చేసే పనికి పూనుకున్నారు జగన్! దీంతో… “జగన్ ప్రభుత్వం జీవో నెం1 ని ఒకందుకు పెడితే, అది మరోరకంగా జగన్ పార్టీకి బౌన్స్ బ్యాక్ అవుతుంది” అని చెబుతున్నారు విశ్లేషకులు! ఇకపై అయినా… ఇలాంటి ఆలోచనలు జగన్ తగ్గిస్తే మంచిదని సూచిస్తున్నారు వైకాపా శ్రేణులు!

కాగా… రోడ్లపైనా, ఇరుకు సందుల్లోనూ మీటింగులు పెట్టడం వల్ల బాబు ఖాతాలో తాజాగా మరో 11 మరణాలు చేరిన సంగతి తెలిసిందే! ఇలాంటి ప్రమాధాలు జరగడం వల్లే జీవో నెంబరు 1 వచ్చిందనే విషయం తమ్ముళ్లు గ్రహించకున్నా, ప్రజలు గ్రహించాలని ఈ సందర్భంగా పలువురు కోరుకోవడం కొసమెరుపు!