గంటా శ్రీనివాసరావు కీలక నిర్ణయం.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ?

YSRCP minister in fear with Ganta Srinivasa Rao

విశాఖ పట్టణానికి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అది స్పీకర్ ఫార్మెట్లో లేదంటూ రాజకీయంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరో సారి స్పీకర్ ఫార్మాట్లో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

YSRCP minister in fear with Ganta Srinivasa Rao
 Ganta Srinivasa Rao

విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నిరాహారదీక్ష శిబిరం వేదికగానే ఈరోజు స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా సమర్పించనున్నట్టు చెబుతున్నారు. ఇక మరో పక్క విశాఖ ఉక్కుపరిరక్షణ పోరాట కమిటీ రిలే దీక్షలు ప్రారంభం అయ్యాయి. కూర్మన్నపాలెం గేట్ దగ్గర జేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల అందోళనకు దిగారు.

ఈ ఈనెల 18న ఉక్కు ఆవిర్భావ దినోత్సవం ఉండగా వేడుకలను బహిష్కరించి పరిరక్షణ దినం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే రోజు కుటుంబ సభ్యులతో కలిసి గాజువాకలో కార్మిక సంఘాలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు జాతీయ నాయకులు హాజరుకానున్నారు.