గబ్బర్ సింగ్ స్ట్రైక్స్ ఎగైన్.! మోడీ సారూ.. ఏంటిది.?

జీఎస్‌టీ అంటే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని. కానీ, దీనికి అర్థం మారిపోయింది.. ఇదిప్పుడు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అయిపోయింది. ‘గబ్బర్ సింగ్ స్ట్రైక్స్ ఎగైన్’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.

జీఎస్టీకి సంబంధించి స్లాబులు మారాయ్. కాదు కాదు, స్లాబులు అలాగే వున్నాయ్.. ఆయా స్లాబుల్లో వున్న వస్తువులు, సేవలు మారాయంతే.! ఔను, వాటికి ప్రమోషన్ వచ్చేసింది. దాంతో, సామాన్యుడి నడ్డి విరిగిపోనుందన్నమాట ఇకపై.!

గబ్బర్ సింగ్ నరేంద్ర మోడీ.!

ప్రతిరోజూ పెట్రోల్ ధరలతో మోత మోగించడం నరేంద్ర మోడీ హయాంలో మొదలైన సంగతి తెలిసిందే. నెలలో ఎప్పుడంటే అప్పుడు వంట గ్యాస్ ధర కూడా పెరిగిపోతూ వస్తోంది. ఇవి కాకుండా, ప్రతి నెలా మొదటి తారీఖున అనేక వడ్డనలు వుంటున్నాయి. దానికి తోడు, జీఎస్టీ వాతలు కూడాను.!

ఇంతకీ, ఇలా జీఎస్టీ రూపంలో వసూళ్ళు చేస్తున్న సొమ్ములు ఏమైపోతున్నాయ్.? దేశ భవిష్యత్తు కోసమంటూ ప్రభుత్వ సంస్థల్ని విక్రయించేస్తోంది కేంద్రంలోని మోడీ సర్కారు. అవి చాలక, వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేసేస్తోంది. అవీ సరిపోక, ఇదిగో ఇలా జీఎస్టీ రూపంలో వాయించి పడేస్తోంది మోడీ సర్కార్.

దేశంలో కొందరు సంపన్నులు మాత్రమే బాగుపడుతున్నారు, సామాన్యుల బతుకు ఛిద్రమైపోతుందన్న విమర్శ కొత్తేమీ కాకపోయినా, అది ఈ మధ్య మరింత భయానకంగా వినిపిస్తోంది.