ఫ్లాష్ న్యూస్ ‌: ఎమ్మెల్యే ప‌ద‌వికి గంటా శ్రీనివాస‌రావు రాజీనామా !

indian bank to aution of ganta srinivasarao assets for bad debts

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ‌ప‌ట్నం ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అమలులోకి వచ్చిన వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని గంటా శ్రీనివాసరావు స్పీకర్ కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Ganta srinivasarao

తాను మాటల మనిషిని కానని, చేతల మనిషనని గంటా శ్రీనివాసరావు చెప్పారు. తన నేతృత్వంలోనే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. కాగా, గ‌త కొంత కాలంగా ఆయ‌న రాజ‌కీయాల్లో యాక్టీవ్‌గా లేరు. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌హారాల‌కు సైతం గంటా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఒకానొక స‌మ‌యంలో ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఇంత‌కాలం సైలెంట్‌గా ఉన్న గంటా ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే ప‌దవికి రాజీనామా చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక నుంచి ఆయ‌న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మ‌లో చురుగ్గా పాల్గొన‌నున్నారు.