అధికారికంగా గెలిచిన మొదటి సీటు వైసిపిదే అయ్యింది. పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో పోటీ చేసిన వైసిపి అభ్యర్ధి ఎలీజా గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం నుండి ఇప్పటి వరకూ ఏ నియోజకవర్గం తీసుకున్నా అన్నీ ఆధిక్యతలే కానీ గెలుపు ఎక్కడా లేదు. అలాంటిది మధ్యహ్నం 1 గంట దాటిన తర్వాత చింతలపూడిలో వైసిపి గెలిచినట్లు ప్రకటన వచ్చింది
.వైసిపి తరపున ఎలీజా పోటీ చేస్తే టిడిపి తరపున కర్రా రాజారావు పోటీ చేశారు. మాజీ మంత్రి పీతల సుజాత కు టికెట్ ఇవ్వనీయకుండా ఎంపి అభ్యర్ది మాగంటి బాబు, ఇతర నేతలు అడ్డుకున్నారు. దాంతో వాళ్ళపై ఆగ్రహంతో ఉన్న సుజాత వర్గం అభ్యర్ధి కర్రా రాజారావు గెలుపుకు పనిచేయలేదని సమాచారం. అంతేకాకుండా సహజంగానే ప్రభుత్వంపై ఉండే వ్యతరేకత కూడా తోడైంది.
అదే సమయంలో వైసిపి అభ్యర్ధి ఎలీజాకు పార్టీలోని నేతలందరూ మంచి సహకారం అందించారు. దానికితోడు ప్రభుత్వంపై జనాల్లోని వ్యతిరేకత కూడా తోడైంది. దాంతో ఎలక్షనీరింగ్ లో వైసిపి మంచి మార్కులే సాధించింది. దాని ఫలితంగానే ఈరోజు ఫలితాల్లో ఎలీజా ప్రత్యర్ధిపై 31400 ఓట్ల మెజారిటీతో గెలిచారు.