బ్రేకింగ్ న్యూస్ : విశాఖ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

విశాఖలోని గాజువాకలో షార్టూసర్క్యూట్ తో రెండు సినిమా థియేటర్లు దగ్ధమయ్యాయి. గాజువాక మెయిన్ రోడ్డులో ఒకే భవనంలో ఉన్న కన్య, శ్రీకన్య సినిమా థియేటర్లలో అగ్ని ప్రమాదం జరిగింది. థియేటర్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్వీపర్ చిట్టెమ్మ యజమానికి సమాచారం ఇవ్వడంతో ఆయన ఫైరింజన్లకు ఫోన్ చేశాడు. 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. అప్పటికే థియేటర్లు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి.

 

పూర్తిగా దగ్ధమైన థియేటర్ లోెపలి భాగాలు

థియేటర్లలోని తెరలు, సీట్లు, ప్రొజెక్టర్లు, ఏసీ యూనిట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 3 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు పోలీసులు అంచనా వేశారు. థియేటర్ షో టైమ్ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని లేకపోతే భారీ ప్రాణ నష్టం జరిగేదని పలువురు అభిప్రాయపడ్డారు.