బెంగుళూరు ఎయిర్ షోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏరో ఇండియా-2019 ఎయిర్ షో గేట్ నంబర్ 5 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 300 కార్లు కాలి బూడిదయ్యాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పార్కింగ్ చేసిన ఓ కారులో నుంచి ఆకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటలు పక్కనే ఉన్న కార్లకు అంటుకున్నాయి.
అలా వరుసగా పార్కింగ్ చేసిన అన్ని కార్లకు మంటలు వ్యాపించాయి. దీంతో క్షణాల్లోనే అక్కడ భీకర వాతావరణం ఏర్పడింది. ఫైరింజన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పుతున్నాయి. వందల కోట్లలో నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఏయిర్ షో ప్రారంభానికి ముందు రోజు కూడా విమానాలు ఢీ కొని ఓ పైలట్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఎయిర్ షో లో కనీసం భద్రతా చర్యలు చేపట్టనందునే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.