సిబిఐ విచారణ ముందుకు సుజనా

చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి  సిబిఐ విచారణకు హాజరవబోతున్నారు. బ్యాంకును మోసం చేసిన కేసులో సుజనాకు సిబిఐ నోటీసులిచ్చింది. శుక్రవారం బెంగుళూరులో జరిగే విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులో పేర్కొంది.

చెన్నైలి ఆంధ్రాబ్యాంకు, సెంట్రల్ బ్యాంకు తో పాటు కమర్షియల్ బ్యాంకుల కన్షార్షియటం నుండి  రూ 364 కోట్ల రుణం తీసుకున్నారు. ఇందులో ఆంధ్రాబ్యాంకు నుండి తీసుకున్న రూ 71 కోట్లను డొల్ల కంపెనీలకు తరలించారు. ఈ విషయాన్ని ఆంధ్రాబ్యాంకు పసిగట్టి సిబిఐకి ఫిర్యాదు చేసింది.  బ్యాంకు నుండి తీసుకున్న రుణాన్ని సుజనా తన బినామి కంపెనీకి బదలాయించినట్లు గుర్తించింది సిబిఐ.

అసలు సుజనా గ్రూపులో చాలా డొల్ల కంపెనీలున్నట్లు సిబిఐ గుర్తించింది. డొల్ల కంపెనీలను పెట్టుకుని పట్టుబడిన తర్వాత కూడా సుజనా లేకపోతే టిడిపి నేతలు ప్రత్యర్ధులపై విరుచుకుపడుతుంటారు. టిడిపి నేతలు చెప్పే నీతులన్నీ గురివిందగింజ నీతే అని అర్ధమవుతోంది. లేకపోతే వేల కోట్ల రూపాయల కుంభకోణాల్లో ఇరుకున్న సుజనా కూడా ఇతరులకు నీతులు చెప్పటమేంటి ?

ఇక్కడ విషయం ఏమిటంటే బ్యాంకుల నుండి అప్పులు తీసుకున్న కంపెనీలతో తనకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. ఎలాగంటే 2014లోనే కంపెనీల బాధ్యతల నుండి పక్కకు వచ్చేసినట్లు చెబుతున్నారు. అంటే అప్పులు తీసుకోవటం, వ్యూహాత్మకంగా డొల్ల కంపెనీలకు తరలించటం, తర్వాత కంపెనీల బాధ్యతల నుండి పక్కకు తప్పుకోవటం. సుజనా మాట్లాడుతున్నది ఇలాగే ఉందని వైసిపి నేతలంటున్నారు. మరి సిబిఐ విచారణలో ఏమి తేలుతుందో చూడాల్సిందే.