తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి మోసం చేశాడని సినీ నటి తారా చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడని తెలిపింది. తారా చౌదరి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వివరాలు ఏంటంటే..
తారా చౌదరి సినీ నటి. పలు చిత్రాలలో సెక్సీగా నటించి అభిమానుల మది దోచుకుంది. ఆమెకు పలువురు ప్రముఖులతో సంబంధాలు కూడా ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. తారా చౌదరి శ్రీనగర్ కాలనీలోని గణపతి కాంప్లెక్స్ లోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది. తారా చౌదరి స్వంత ఊరు గుంటూరు. 2016 లో తారా చౌదరికి వరుసకు బావ అయిన రాజ్ కుమార్ ఆయన అక్క సుజాతతో కలిసి గుంటూరులోని తారా చౌదరి ఇంటికి వచ్చాడు. అక్కడ తారా చౌదరిని చూసిన రాజ్ కుమార్ ఆమె పై కన్నేశాడు.
తారా చౌదరి ఫోన్ నంబర్ తీసుకొని పరిచయం పెంచుకున్న రాజ్ కుమార్ మరో సారి తారా చౌదరిని కలిసి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అప్పుడు తారా చౌదరి తిరస్కరించింది. తారా చౌదరి కోసం ఆమె ఎక్కడ ఉంటే అక్కడికి రాజ్ కుమార్ వెళ్లి వెంటపడేవాడు. తారా చౌదరి వినకపోవడంతో మరోసారి తన సోదరి సుజాతను తీసుకొని తారా చౌదరి దగ్గరకు వచ్చాడు. రాజ్ కుమార్ కు అప్పటికే పెళ్లయింది. పెళ్లయినవాడివి నన్నెలా పెళ్లి చేసుకుంటావు అని తారా చౌదరి ప్రశ్నించింది. విడాకులకు అప్లై చేస్తాడని విడాకులు వచ్చాకే పెళ్లి చేసుకుంటాడని సుజాత తారా చౌదరికి తెలిపింది.
అప్పటి నుంచి రాజ్ కుమార్ తారా చౌదరి మధ్య బంధం పెరిగింది. రాజ్ కుమార్ అప్పుడప్పుడు హైదరాబాద్ కు వచ్చి తారా చౌదరిని కలిసేవాడు. హైదరాబాద్ రావడం ఇబ్బంది అవుతుండడంతో విజయవాడలోని ఓ అపార్ట్ మెంట్ అద్దెకు ఇల్లు తీసుకొని తారా చౌదరిని అక్కడే ఉంచాడు. తారా చౌదరి తన భార్య అని రాజ్ కుమార్ అందరిని నమ్మించాడు.
విజయవాడ నుంచి హైదరాబాద్ కు మళ్లీ మకాం మార్చారు. బంజారా హిల్స్ లోని గణపతి కాంప్లెక్స్ సమీపంలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని అందులో సహజీవనం చేస్తున్నారు. తారా చౌదరికి సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాజ్ కుమారే తీసుకునేవాడని తెలుస్తోంది.
ఇటీవల రాజ్ కుమార్ తన పై వేధింపులకు పాల్పడుతున్నాడని తారా చౌదరి ఆరోపించింది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని ఆస్తులు విక్రయించాలని రాజ్ కుమార్ తారా చౌదరిని వేధించాడని తెలిపింది. పెళ్లి చేసుకోవాలని కోరగా ఎటువంటి స్పందన లేకుండా డబ్బుల కోసం హింసిస్తున్నాడని వాపోయింది. రెండేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్నాడని, అందరికి భార్యగా చెప్పి ఇప్పడు వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
పెళ్లి చేసుకోమంటే తనను అనేక సార్లు కొట్టాడని కూడా ఫిర్యాదులో తారా చౌదరి తెలిపింది. తారా చౌదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో తారా చౌదరికి టిడిపి నాయకునితో సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన టిఆర్ఎస్ లో చేరారు.