తన పై అసత్య ప్రచారాలను చేస్తూ తనని వేధిస్తున్నారని సినీ నటి అపూర్వ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. టిడిపి నేత, దెందులూరు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్త చేసింది. ఇంతకీ పూర్తి వివరాలు ఏంటంటే…
సిని నటి అపూర్వ పలు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. గత కొద్ది రోజులుగా అపూర్వ కుటుంబ వ్యవహరాలపై గుర్తు తెలియని వ్యక్తులు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అభ్యంతకరంగా పోస్టులు పెడుతున్నారు. అసలు ఎవరు ఎందుకు పోస్టులు పెడుతున్నారో ముందుగా ఆమెకు తెలియలేదు. అయితే అవి దెందులూరు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల నుంచి వస్తున్నాయని తెలుసుకోగలిగింది.
గతంలో చింతమనేని ప్రభాకర్ పై అపూర్వ కామెంట్స్ చేశారు. దీంతో అవి దృష్టిలో పెట్టుకుని తన పై కావాలని కామెంట్స్ చేస్తున్నారని అపూర్వ గుర్తించింది. దీంతో ఆమె సోమవారం ఉదయం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం పై అపూర్వ ఏమన్నారంటే…
“చింతమనేని ప్రభాకర్ కు సంబంధించి ఓ విషయంలో నేను ఆయన పై కామెంట్స్ చేశాను. దానిని దృష్టిలో ఉంచుకొని చింతమనేని అనుచరులు తనను వేధిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. ముందుగా నేను గుర్తించలేదు. తర్వాత అది చింతమనేని అనుచరులు చేస్తున్నట్టుగా గుర్తించాను. సోషల్ మీడియాలో అసభ్యకరంగా నా ఫోటోలు పెడుతున్నారు. పిచ్చి పిచ్చి కామెంట్లతో నన్ను వేధిస్తున్నారు. అవమానకరంగా మాట్లాడారు.
తన కుటుంబ వ్యవహారాలను సోషల్ మీడియాలో పెడుతూ నన్ను మానసికంగా వేధిస్తున్నారు. వేధింపులకు పాల్పడిన వారి పై పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలి. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని నా పై అసత్య ఆరోపణలు చేస్తున్న టిడిపి నాయకులను కట్టడి చేయాలి.” అని అపూర్వ అన్నారు.