ట్రాఫిక్ పోలీసుల తీరు, FC లకు నిరసనగా ఈ నెల 5న ఇందిరాపార్కు వద్ద ఆటోడ్రైవర్ల మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆటోడ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ తెలిపారు. ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ ఓనరు పేరు రాసి డ్రైవరు సీటు వెనుక భాగంలో ఒక ప్లేటు బిగిస్తే సరిపోతుంది. కానీ స్టికర్ల ఖర్చుల కోసం ఒక్కో ఆటో నుంచి రూ. 220 బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మై ఆటో ఈజ్ సేప్ సపరేటు ఆటో రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 5న ఆటోడ్రైవర్ల మహాధర్నాకు డ్రైవర్లు పెద్దఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆటోడ్రైవర్స్ జేఏసీ నాయకులు వి.కిరణ్, ఎ.సత్తిరెడ్డి, అజయ్‌బాబు, ఎం.ఎ.సలీం, మీర్జా రఫతుల్లాబేగ్, జామా, నరేందర్, మల్లే్‌షగౌడ్, వెంకటేశం పాల్గొన్నారు.