కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన కోట్ల హరిచక్రపాణిరెడ్డి బిజెపిలో చేరారు. ఇతర పార్టీలలో అసంతృప్తి నాయకులను అక్కున చేర్చుకునేందుకు ఆంధ్రలో బిజెపి కొత్త ఉద్యమం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా హరిచక్రపాణిరెడ్డిని మచ్చిక చేసుకోగలిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం నుంచి ఒక వ్యక్తి సెక్యులర్ పార్టీలను వదిలేసి బిజెపిలో చేరారు.
సోమవారం బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరి సమక్షంలో హరి కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన జిల్లాకు చెందిన పెద్ద నాయకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబీకుడు. దీనితో బిజెపి ఉత్సాహానికి అవధుల్లేకుండా పోయాయి. ఇయన ప్రస్తుతం వైసిపిలో ఉన్నారు. 2014లో వైసీపీ తరఫున పత్తికొండ నుంచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిపై పోటీ చేశారు. అయితే ఓడిపోయారు. పత్తికొండ వైఎస్సార్ సిపి ఇన్‌చార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణ హత్యకు గురి కావడంతో ఆయనభార్య శ్రీదేవికి పత్తికొండ అభ్యర్థిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇదే హరి అలుకకు కారణమని చెబుతున్నారు.
దీనితో అసంతృప్తికి గురయిన కోట్ల చక్రపాణిరెడ్డి వైసిపి వీడే ప్రయత్నం చేస్తున్నారు. మొదట టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. అయితే,జిల్లా టిడిపిలో కర్నూలు లోక్ సభ స్థానం కిందికి వచ్చే ఏరియా కేఈ కుటుంబం పలుకుబడిలోఉ ది. దీనితో హరి చేరికకు కెఇ కుటుంబీకులు అభ్యంతరం తెలిపారు. ఇలాంటపుడు ఆయనకు భారతీయ జనతా పార్టీ స్వాగతం పలికింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నేను చేరింది మోడీ ఘనత,ఆయన తీసుకువచ్చిన అనేక సంస్కరణలను చూసే. నేను ఈ పార్టీ లో చేరడానికి కారణం ఇద్దరే ఇద్దరు…ఒకరు కన్నా లక్ష్మీనారాయణ, ఇంకొకరు పురందేశ్వరి,’ అని హరి అన్నారు.
పార్టీ లో నిబద్ధత,విశ్వాసం తో పనిచేస్తా,నా చివరి శ్వాస వరకు ఈ కండువతోనే ఉంటా నని కూడా ఆయన అన్నారు.
పురందేశ్వరి బీజేపీ జాతీయ నాయకురాలు
ఏపీలో బీజేపీ కి ఉనికి లేదని చెప్పే హరి చేరిక ఒక చెంపపెట్టు లాంటిదని ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ సీనియర్ నేత పురందేశ్వరి అన్నారు.
‘ఓ గొప్ప కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి బీజేపీ లో చేరారు.విజయ్ భాస్కర్ రెడ్డి కిఅత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి హరి చక్రపాణి రెడ్డి.అవినీతి లేని పాలన చెస్తున్న మోడీ విధానాలు నచ్చే చాలా మంది బీజేపీ లో చేరుతున్నారు,’ అని ఆమెఅన్నారు.
ఏపీ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
అమిత్ షా కొత్త వారిని చేర్చుకోవాలని చెప్పారు…అప్పుడు అనుకున్నాం ఎవరు చేరుతారు అని ఆలోచించాం.కానీ మాకు ఇప్పుడు చేరికలు జరగడం శుభపరిణామం.ఏపీ లో జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్రం చలవే.పోలవరం కు జాతీయ హోదా కల్పించింది బీజేపీ మాత్రమే, అని ఆమె అన్నారు..