హరికృష్ణ మృతిపై ‘రాంగోపాల్ వర్మ’ వివాదాస్పద ట్వీట్

ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన ఏ సినిమా తీసినా సంచలనమే. ఏం మాట్లాడినా సంచలనమే. చాలా సందర్భాల్లో ఆయన చర్యలు వివాదాస్పదం అవుతుంటాయి. అటువంటి వర్మను ఉపయోగించుకుని కొంతమంది వివాదాలు సృష్టిస్తున్నారు.

హరికృష్ణ మృతిపై రామ్ గోపాల్ వర్మ అనే ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్ వివాదాస్పదం అయ్యింది. ఇప్పుడు ఆ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. హరికృష్ణ మృతిపై చంద్రబాబుని ఉద్దేశించి చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ అనే ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఆ ట్వీట్ సారాంశం ఏంటో కింద ఉంది చూడండి.

“నందమూరి హరికృష్ణ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. హరికృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ చంద్రబాబు నాయుడు అందరిముందు నటించొద్దు. మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో తెలుసు. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలి అంటే మీరు హరికృష్ణ గారి భౌతికకాయం దగ్గరకి వెళ్లొద్దు అని ఉంది”.

అయితే అదిరామ్ గోపాల్ వర్మ పేరుతోనే ఉన్న ఫేక్ ట్విట్టర్ ఖాతా అని తెలుస్తోంది. ఎవరో ఆకతాయిలు రామ్ గోపాల్ వర్మని అడ్డం పెట్టుకుని ఇలా ట్రోల్స్ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే ఈ ట్వీట్ మాత్రం జనసేన, వైసీపీ వర్గాల్లో జోరుగా వైరల్ అవుతోంది. కింద ఆ ట్వీట్ ఉంది చూడవచ్చు.