జనసేన పార్టీలోకి ఉత్తరాంధ్రకి చెందిన ఓ మాజీ మంత్రి దూకేయబోతున్నారట. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గానే వున్నారట. ఎవరా మాజీ ఎంపీ.? ఏమా కథ.? మాజీ మంత్రి.. అంటే, ఆయనిప్పుడు ఎమ్మెల్యేగా కూడా పని చేస్తున్నారట.!
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు ఏపీ అసెంబ్లీకి. అయితే, ఆయనిప్పుడు రాజకీయాల్లో అంతగా యాక్టివ్‌గా లేరు. అసలు టీడీపీలో ఆయన వున్నారో లేదో టీడీపీ అధినాయకత్వానికే స్పష్టత లేదు. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు గంటా శ్రీనివాసరావు.
ఆ పరిచయంతోనే, జనసేనలోకి వెళ్ళేందుకు గంటా శ్రీనివాసరావు ప్రయత్నిస్తే అందులో వింతేముంది.? కానీ, జనసేన పార్టీ మాత్రం గంటా శ్రీనివాసరావు విషయంలో అంత ఆసక్తిగా వున్నట్లు కనిపించడంలేదు.
విశాఖకే చెందిన మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా వున్నారు. కొన్నాళ్ళ క్రితమే ఆయన మంత్రి పదవి కోల్పోయారు.. అదీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో.
అవంతి శ్రీనివాసరావు జనసేనలోకి వెళ్ళడం సాధ్యమయ్యే పనేనా.? ఎందుకంటే, ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్.. వైసీపీ మీద విమర్శలు చేసే క్రమంలో.. ‘బంతి, చామంతి..’ అంటూ పరోక్షంగా అవంతి పేరుని ప్రస్తావించి వెటకారం చేశారన్న వాదన వుంది.
పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో జనసేన పార్టీకి కొన్ని శక్తులు తెరవెనుకాల కొంత మద్దతిచ్చే ప్రయత్నం చేశాయి. అది గంటా వర్గమా.? అవంతి వర్గమా.? అన్నదానిపై టీడీపీలోనూ, వైసీపీలోనూ పెద్దయెత్తున రచ్చ జరుగుతోందట.