Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తరచూ తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైయస్ జగన్ మండపేట, మదనపల్లె, గొల్లప్రోలు, పెనుకొండ వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఈయన మాట్లాడుతూ కరోనా రోజులను గుర్తు చేసుకున్నారు. కరోనా సమయంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గిన ప్రజల క్షేమం ముఖ్యమని ప్రజల కష్టాలను గుర్తించి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చామని తెలిపారు.
ఇలా కరోనా సమయంలో కూడా ప్రజలకు అండగా ఉండటం వల్లే నాటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని చెప్పారు. తాడిపత్రి మున్సిపాలిటీలో మెజార్టీ లేకపోవడంతో అక్కడ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించినట్లు తెలిపారు. తాడిపత్రిలో చైర్మన్ పదవి కోసం మనం అడ్డుదారులు తొక్క లేదని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని కుప్పంలో పెద్ద ఎత్తున అరాచకాలు జరుగుతున్నాయని కేవలం కుప్పం మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉందని తెలిపారు.మన పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు విలువలుతో నిలబడ్డారు. చూసి నేర్చుకొమ్మని బాబుకు గుణపాఠం చెప్పిన మీ అందరికీ హాట్సాఫ్ అంటూ జగన్ ప్రశంసలు తెలిపారు. చంద్రబాబు నాయుడు వచ్చిన ఏడాదికే రాష్ట్రంలో పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఆరోగ్యశ్రీ లేక ప్రజలు అనారోగ్య సమస్యలతో అప్పులు పాలవుతూ మరణిస్తున్నారు రైతులకు పంటలు లేక నష్టాలు వస్తున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. ఇలా విద్య వైద్య రంగం పూర్తిగా అల్లకల్లోలంగా మారిందని తెలిపారు.
ఇక కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పెద్ద ఎత్తున వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శలపై కూడా వైయస్ జగన్ స్పందించారు. మహానాడు కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమంలో నన్ను తిట్టడం హీరోయిజం కాదు అంటూ చంద్రబాబు పై విమర్శలు కురిపించారు.రాష్ట్రంలో కలియుగ రాజకీయాలు చంద్రబాబు దౌర్భాగ్య పాలనకు నిదర్శనం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యం. కానీ అవేవీ లేకుండా చంద్రబాబు రాజకీయం ఉందని జగన్ ధ్వజమెత్తారు.